Virat Kohli latest Instagram story: అక్టోబర్ 5 నుంచి అంటే రేపటి నుంచే వరల్డ్ కప్ (World Cup 2023)సందడి మొదలవుతోంది. మొదటి మ్యాచ్ గుజరాత్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం ఇండియామొత్తం ప్రపంచకప్ ఫీవర్‌తో ఊగిపోతోంది. మెగా టోర్నీని చూసేందుకు ఆందరూ తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులోని ప్రత్యక్షంగా చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఇప్పుడు మన క్రికెట్ టీమ్ ఆటగాళ్ళకు అదే పెద్ద తలనొప్పిగా మారిందట.
వరల్డ్ కప్ దగ్గర పడుతున్న కొద్దీ ఆటగాళ్ళ మీద ఒత్తిడి పెరిగిపోతోందిట. వరల్డ్ కప్ గెలవాలని ఎలాగో మనవాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది దానికి తోడు వాళ్ళు మరో ప్రాబ్లెమ్‌ని కూడా ఫేస్ చేస్తున్నారు. అదేంటంటే…ప్లేయర్స్ బంధువులు, ఫ్రెండ్స్ మ్యాచ్‌ల టికెట్లు ఇమ్మని తెగ అడుగుతున్నారుట. ఈ బాధను తట్టుకోలేకనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పబ్లిక్‌గా పోస్ట్ పెట్టాడు. వన్డే ప్రపంచకప్ 2023 టికెట్లు తని ఎవరూ అడొగొద్దని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు విరాట్. బంధువులకు అయితే స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు కూడా. ప్లీజ్ టోర్నీ ముగిసేవరకునన్నెవరూ టికెట్లు అడగొద్దు. ఇంట్లో నుంచే మ్యాచ్‌లను ఎంజాయ్ చేయండి అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో రాసాడు. ఈ మ్యాటర్ సీరియస్ అవ్వకుండా ఉండడం కోసం ఓ ఫన్నీ ఎమోజీని కూడా పెట్టాడు.
Virat Kohli’s latest Instagram story. pic.twitter.com/i6irFh42TN
— CricketMAN2 (@ImTanujSingh) October 4, 2023
ఇక ప్రపంచకప్ ఆరంభానికంటే ముందు ప్రతి జట్టు కూడా రెండేసి వార్మప్ మ్యాచ్ లు ఆడాయి. అయితే వర్షం కారణంగా భారత్ ఆడాల్సిన రెండు మ్యాచ్ లు కూడా రద్దయ్యాయి.వార్మప్ మ్యాచ్ లను చక్కగా ఉపయోగించుకున్న జట్టు న్యూజిలాండ్. పెద్దగా హడావిడి చేయకుండానే ప్రపంచకప్ కోసం భారత్ కు వచ్చిన కివీస్.. రెండు వార్మప్ మ్యాచ్ ల్లోనూ విజయాలను సాధించింది. పాకిస్తాన్ పై 346 పరుగుల టార్గెట్ ను ఛేదించి.. అనంతరం సౌతాఫ్రికాపై లక్ష్యాన్ని కాపాడుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ పరుగులు చేయడం ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం. రచిన్ రవీంద్ర, మార్క్ చాప్ మన్, జిమ్మీ నీషమ్ లు కూడా ఫామ్ లో ఉన్నారు. చూస్తుంటే కివీస్ మరోసారి ప్రపంచకప్ లో చెలరేగిపోయేలా కనిపిస్తుంది.భారత్ ఆడాల్సిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు కూడా వర్షం కారణంగా రద్దయ్యాయి. దాంతో భారత్ ప్రాక్టీస్ లేకుండానే అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే భారత్ సెమీస్ చేరడం ఖాయంలా కనిపిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ బలంగా ఉంది. ఏ రకంగా చూసినా ఈ వరల్డ్‌కప్‌లో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లే ఫేవరెట్లుగా ఉన్నాయి.
also read:దేశీ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు…అసలేం జరుగుతోంది?