Revenge angle: ఉత్తరప్రదేశ్‌లో తోడేళ్ళు అక్కడ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వీటి దాడుల్లో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. ఇందులో ఏడుగురు చిన్నారులే ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో తోడేళ్ళు దాడులు చేస్తున్నాయి. చిన్నపిల్లలే టార్గెట్‌గా దాడి చేస్తున్న వీటిని పట్టుకోవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ భేడియా చేపట్టింది. కనిపిస్తే కాల్చి చంపేయమని యోగి గర్నమెంట్ ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. తోడేళ్ళ వలన కొన్ని గ్రామాలకు కంటి మీద కునుకే లేకుండా పోయింది. అసలు ఇలా సడెన్‌గా తోడేళ్ళు ఎందుకు పగ పట్టినట్టు ప్రవర్తిస్తున్నాయి. అర్ధరాత్రి పూటే ఎందుకు దాడులు చేస్తున్నాయి. చిన్నారులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయనే ప్రశ్నలు ఇప్పుడు అక్కడ అందరినీ వేధిస్తున్నాయి.
తాజాగా తోడేళ్ళ దాడికి కారణాలు చెప్పారు ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సంజయ్ పాఠక్. తోడేళ్ళకు ప్రతీకారం తీర్చుకునే అలవాటు ఉందని ఆయన చెప్పారు. అవి ఉండే ప్రదేశాలకు, పిల్లలకు హాని చేస్తే అవి ప్రతీకారం చేస్తాయని అంటున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో తోడేళ్ళ దాడి వెనుక కూడా ఇదే కారణం అయి ఉండవచ్చని పాఠక్ అంటున్నారు. బహ్రైచ్‌లోని రాముపూర్ సమీపంలోని ఓ చెరుకు తోటలో రెండు తోడేలు పిల్లలను గుర్తిచామని గ్రామస్తులు చెప్పారు. భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతంలో వరదలు వచ్చాయని…అప్పుడు ఆ వరదల్లో తోడేలు పిల్లలు చనిపోయి ఉండవచ్చని తెలిపారు. అయితే.. వాటి తల్లి తోడేలు…వాటిని తామే చపామని అనుకుంటోందని…అందుకే గ్రామంపై దాడులు చేస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అటవీ ప్రాంతంలో తోడేళ్ల ఆవాసాలను తొలగించటంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక అవి గ్రామాలుపై దాడులు చేస్తున్నాయని అటవీశాఖ నిపుణులు చెబుతున్నారు.