Vijayawada: విజయవాడ దుర్గగుడికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్ రోడ్డు మూసివేస్తున్నట్లు చెప్పారు. మహామండపం వైపు నుంచి ఆలయానికి చేరుకోవాలని భక్తులకు సూచించారు. ఆషాడం సారె సమర్పణకు వస్తున్న భక్తులతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
Vijayawada Durga Temple
Big Breaking: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద విరిగిపడిన కొండచరియలు
Vijayawada Kanaka Durga Temple: విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. గుడిలోని కేశఖండనశాల పక్కన ఉన్న కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయయంలో కొంతమంది పాదచారులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మూడు బైక్స్ ధ్వంసం అయినట్లు చెబుతున్నారు.
ఆదివారం రాత్రి నగరంలో భారీ వర్షం కురిసింది. వర్షాలతో కొండచరియలు బాగా నాని కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ దుర్గగుడి కొండచరియలు విరిగిపడిన సందర్భాలు లేవని స్థానికులు చెబుతున్నారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రోడ్డుపై విరిగి పడిన కొండచరియలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడిన సమయంలో రోడ్డుపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో వాదనలు