Vadapalli Venkateswara Brahmotsavam: అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 4వ రోజు ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనము, పంచామృత మండపారాధనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైయింది. స్వామివారికి అంగరంగ వేభోగంగా కళ్యాణోత్సవం ఆలయ అర్చకులు నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవంలో కొత్తపేట ఎమ్మెల్యే ప్రభత్వ విఫ్ చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే జగ్గరెడ్డి దంపతులకు ఆలయ మర్యాదలతో వేదపండితులతో ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు. సతీసమేతంగా కుటుంబ సభ్యులతో కలసి స్వామివారికి కళ్యాణోత్సవం ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నిర్వహించారు. వివిద రాష్ట్రాలకు చెందిన మంగళ వాయిద్యాలు తీన్మార్ డప్పులు కళారూపాలతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లింది.
అంగరంగ వైభవంగా సాగిన ఊరేగింపు
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న స్వామివారు కోదండరాముని అలంకరణలో హనుమద్వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనంపై మేళతాళాలతో అంగరంగ వైభవంగా సాగిన ఊరేగింపులో స్వామివారిని చూసి భక్తులు భక్తిపారవశ్యంతో తన్మయులయ్యారు. ధర్మసంస్థాపన కోసం రావణ సంహారం చేసిన రామచంద్రమూర్తిగా దర్శనమిచ్చిన.. ఏడు శనివారాల వేంకటేశ్వరస్వామికి హనుమ స్వయంగా వాహనమయ్యారు. ఈ వాహన సేవను దర్శిస్తే బుద్ధి, కీర్తితో పాటు భూతప్రేత పిశాచాలు దరి చేరవు. సంపూర్ణ ఆయురారోగ్యాలుగా ఉంటారని భక్తులు విశ్వసిస్తారు.
భక్తులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఉభయ దేవేరులతో కొలువుదీరిన స్వామివారికి శనివార ఉదయం మహాపుష్పయాగం ఘనంగా నిర్వహించారు. దీనికి రావులపాలెం మండలం ఊబలంకకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేడపాటి శ్రీనివాసరెడ్డి, శ్రీదేవి దంపతులు వివిధ రకాల సుగంధభరిత పుష్పాలు, పండ్లు, పట్టువస్త్రాలు స్వామివారికి సమర్పించారు. మహాపుష్పయాగం పూజా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. హనుమద్ వేషధారణ ఏర్పాటు చేసిన ప్రాంతంలో పలువురు భక్తులు సెల్ఫీలు తీసుకున్నారు. ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మ న్ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది పర్యవేక్షించారు.
ఇది కూడా చదవండి: కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు.. కాంట్రాక్టర్ల ప్రాజెక్ట్: కోదండరామ్