Usha Chilukuri: అమెరికా రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఆయన సతీమణి, తెలుగు అమ్మాయి ఉషా చిలుకూరిపై ప్రశంసలు కురిపించారు. తన ప్రతి విజయంలోనూ ఉషా పాత్ర కీలకమైనదని వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వాన్స్ తన భార్య హిందూ ధర్మం తనకెంతో మార్గదర్శకత్వం చేసిందని చెప్పారు. ఈ మేరకు ‘నా భార్య బలమైన మహిళా వాణి. నేను సాధించినదానికంటే ఆమె సాధించిందే ఎక్కువ. ఆమెనే నన్ను వాస్తవ జీవితంలోకి తీసుకొచ్చింది’ అంటూ తెగ పొగిడేశాడు.
మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సన్..
ఇక తమ పెళ్లి, ప్రేమ, భర్తగా తనతో జేడీ వాన్స్ వ్యవహరించే తీరు గురించి చెప్పిన ఉషా.. తాము తొలిసారి యేల్ లా స్కూల్లో కలుసుకొన్నట్లు గుర్తు చేశారు. తమ కలయిక అమెరికా గొప్పదనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘స్నేహితులుగా మా జర్నీ మొదలైంది. అప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు.
Usha Chilukuri Vance is the wife of Donald Trump’s presidential running mate, JD Vance. https://t.co/bdpYlql6C1
— TODAY (@TODAYshow) July 15, 2024
నేను కలిసిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సన్ ఇతడే. బాల్యంలో కష్టాలు దాటుకొని వచ్చి కష్టించే మనిషి. నిజంగా వాన్స్ మీట్ పొటాటోస్ వంటి వ్యక్తే. ఆయన నా శాకాహార అలవాట్లను అనుసరించాడు. నా తల్లి నుంచి భారతీయ వంటలు నేర్చుకొన్నాడు. నా కుటుంబంలో విడదీయలేనంగా కలిసిపోయాడు’ అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక వాన్స్ తీరక సమయాల్లో కుక్కపిల్లలతో ఆడుకొంటాడని చెప్పారు. బోర్ కొడితే ‘బేబ్’ సినిమా చూస్తాడని చెప్పారు.
J.D. Vance tells the story of his Mamaw, who loved God, loved her grandson, and whose language could make a sailor blush. The crowd erupts in “Mamaw! Mamaw!” chants.@JDVance1 pic.twitter.com/24JL8LUJsu
— Charlie Kirk (@charliekirk11) July 18, 2024