Latest Jobs : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్మెంట్(Nursing Officer Posts Recruitment) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 7 నుంచి ప్రారంభమవుతుంది. అర్హత గల అభ్యర్థులు UPSC అధికారిక వెబ్సైట్ upsconline.nic.in ద్వారా ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్(Ministry Of Labor And Employment) లో మొత్తం 1,930 పోస్టులను భర్తీ చేస్తుంది.
ముఖ్యమైన తేదీలు:
–> రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 7 నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 27, 2024న ముగుస్తుంది.
–> దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 07, 2024
–> దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 27, 2024
–> కరెక్షన్ విండో: మార్చి 28 నుంచి ఏప్రిల్ 3, 2024 వరకు ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
–> UPSC అధికారిక వెబ్సైట్ upsconline.nic.in ని విజిట్ చేయండి.
–> హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న UPSC నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
–> అభ్యర్థులు తమను తాము నమోదు చేసుకోవాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
–> రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
-> దరఖాస్తు రుసుము చెల్లించండి.
–> సబ్మిట్పై క్లిక్ చేయండి.
–> పేజీని ఓపెన్ చేయండి. ఫ్యూచర్ పర్పెస్ కోసం దాని హార్డ్ కాపీని మీ దగ్గర పెట్టుకోండి.
Also Read : సామాన్యుడికి బస్టాప్ ఉండదు.. కానీ, అంబానీ కోసం.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్..