Kazipet : దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకల ఆలస్యాన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ (Railway Department) విశ్వప్రయత్నాలు చేస్తోంది. బైపాస్ లైన్లు, రైల్ ఓవర్ రైట్ వంతెనలు నిర్మిస్తోంది. అయితే నగరాలు, నివాస ప్రాంతాల్లో వినూత్నంగా రైల్ అండర్ రైట్ వంతెనలకు శ్రీకారం చుట్టింది. భూగర్భంలో రైలు మార్గాలను నిర్మిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ (Telangana) లోని కోమటిపల్లి-కాజీపేట జోన్ పరిధిలోనే మొదటిసారి అండర్ గ్రౌండ్ ట్రైన్ ట్రాక్ నిర్మిస్తుండగా.. ఇందుకు సంబంధించిన ప్రత్యేకల గురించి సౌత్ రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఆసక్తికర విషయాలు వెల్లించారు.
ఒక ట్రైన్ పైనుంచి మరో రైలు కిందనుంది..
ఈ మేరకు కాజీపేట జోన్ పరిధిలో 11 చోట్ల రైల్ ఓవర్ రైలు వంతెనలున్నాయి. భూగర్భంలో ఒక ట్రైన్ వెళ్తుంటే పైనుంచి మరో రైలు వెళ్తుంది. ఇలాంటి వంతెనలు విజయవాడ సమీపంలో రెండు, వెంకటా చలం, గూడూరు, అకోలా సమీపంలో ఒక్కొక్కటి ఉన్నాయి. అమ్ముగూడ, లాలాగూడ, మేడ్చల్ సమీపంలో రెండు వంతెనలు నిర్మించామని చెప్పారు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో రాజీపేట ఒకటి. ఢిల్లీ (Delhi) నుంచి వచ్చే రైలు మార్గం వడ్డేపల్లి చెరువు దగ్గరకు రాగానే- ‘వై’ ఆకారంలో రెండుగా చీలిపోతుంది. ఒకవైపు వెళ్తే కాజీపేట మార్గం. మరోవైపు వరంగల్ స్టేషన్. ఇందుకోసం రూ.125 కోట్లతో 21.47 కి.మీ. బైపాస్ నిర్మించినట్లు పేర్కొన్నారు.
340 మీటర్ల మేర సొరంగ మార్గం..
కోమటిపల్లి నుంచి వడ్డేపల్లి చెరువు వరకు భూగర్భంలో 340 మీటర్ల మేర సొరంగ మార్గం నిర్మి స్తున్నాడు. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 3,4 నెలల్లో భూగర్భ మార్గం పూర్తయ్యే అవకాశం ఉంది. కోమటిపల్లి దగ్గర భూఊపరి దిల్లీ-సికింద్రాబాద్ రైళ్లు కాజీపేట మీదుగా.. ఢిల్లీ-విజయవాడ మార్గంలోని రైళ్లు వరంగల్ స్టేషన్ మీదుగా రాకపోకలుంటాయి. మూడు వైపులా రైళ్ల రాకపోకలతో వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో రైల్వే బ్రార్ రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా వరంగల్ వైపు గూడ్సు రైళ్లు వెళ్లేంతవరకు.. ఢిల్లీ, బల్లారాల వైపు నుంచి కాజీపేట, సికింద్రాబాద్ వైపు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్లను వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో నిలిపివేస్తున్నారు. దీంతో ప్రయాణం అలస్యం అవుతోంది. ఈ సమస్యను నివారించి బల్లార్షా- సికింద్రాబాద్ విజయవాడ-బల్లార్షా, సికింద్రాబాద్-విజయవాడ ఇలా అన్ని మార్గాల్లో రైళ్ళు సాపీగా రాకపోకలు సాగించేందుకు మటిపల్లి-వరంగల్ మధ్య బైపాస్ లైన్ ను ద.మ. రైల్వే నిర్మిస్తోంది.
రైళ్ల క్రాసింగ్ సమస్యలు తీరిపోతాయి..
ఇక్కడ రూ.125 కోట్ల వ్యయంతో 21.47 కి. మీ. మేర భూగర్భ మార్గం నిర్మిస్తున్నారు. తలం నుంచి రైలు మెల్లమెల్లగా కిందికి దిగుతుంది. అండర్ గ్రౌం డ్లో 340 మీటర్లు ప్రయాణం చేసి.. ఆ తర్వాత మెల్లమెల్లగా పైకి వెళ్తూ వడ్డేపల్లి చెరువు దగ్గర భూ ఉపరితల స్థితికి చేరుకుంటుంది. ఎలక్ట్రిక్ ఇంజిన్తో నడిచేందుకు వీలుగా భూగర్భంలో విద్యుదీకరణ కూడా చేయనున్నారు. అండర్ గ్రౌండ్ మార్గం పనులు సాగుతున్నాయి. ఇది పూర్తైతే కాజీపేట వైపు రైళ్లను ఒకేసారి పంపిచొచ్చని అధికారులు వెల్లడించారు. దీంతో బల్లార్షా నుంచి కాజీపేట, వరంగల్ వైపు వచ్చే రైళ్లకు క్రాసింగ్ సమస్యలు తీరిపోతాయని వెల్లడించారు.
Also Read : భర్తకు ఘనంగా మూడోపెళ్లి చేసిన భార్యలు.. ఆ కోరిక తీరట్లేదని!