RGV Vs Journalist : సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఓ ప్రముఖ జర్నలిస్ట్ కు మధ్య సోషల్ మీడియా వేదికగా బిగ్ వార్ నడుస్తోంది. ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వూలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో క్యారెక్టర్ గురించి వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ మూవీ కంటెంట్, క్యారెక్టర్ గురించి ఓ విలేఖరి తనదైన స్టైల్ లో విమర్శలు చేస్తూ ట్వీట్ చేశాడు. అయితే దీనిపై వర్మ ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన సంభాషణ ఇలా ఉంది.
For ur kind information I only put those pics and videos on my Twitter and what u mean by “raktham madugulo shringaram” u only can know https://t.co/LDikID9HyW
— Ram Gopal Varma (@RGVzoomin) December 29, 2023
ఈ మేరకు ‘వ్యూహం’ సినిమాను ఉద్దేశిస్తూ వెంకట కృష్ణ అనే వ్యక్తి.. ‘ఆర్జీవీ గారు మాకు అన్నిటికీ తేడా తెలుసు. జర్నలిజంలో నైతికవిలువలు పాటించడం బాగా తెలుసు. కానీ మీలా వృత్తిని నగ్నంగా తయారుచేయడం మాత్రమే తెలీదు. సినిమాల్లో రక్తం పారిస్తూ, ఆ రక్తం మడుగులోనూ శృంగారం చేయించే మీరు హింస గురించి మాట్లాడటమే వింత. నేను ఎప్పుడూ హింసకు మద్దతు ఇవ్వను లేదా రెచ్చగొట్టను. మొదటినుంచే మీ ప్రకటనలను నేను ఖండించాను’ అంటూ సెటైర్లు వేశారు.
ఇది కూడా చదవండి : SA vs IND : ఆ ఒక్కడిపై ఆధారపడితే ఫలితాలు దక్కవు.. తొలి టెస్టు ఓటమిపై రోహిత్
yes ofcrs.మాకు అన్నిటికీ తేడా తెలుసు.. జర్నలిజంలో నైతికవిలువలు ఫాలో అవడమూ తెలుసు.మీలా వృత్తిని నగ్నంగా తయారుచేయడం మాత్రమే తెలీదు.సినిమాల్లో రక్తం పారిస్తూ,ఆ రక్తం మడుగులోనూ శృంగారం చేయించే మీరు హింస గురించి మాట్లాడ్డమే వింత.I never support violence nor provoke.i also condemned… https://t.co/rly4OmoW8v pic.twitter.com/yazFfWvWbz
— VenkataKrishna (@vkjourno) December 29, 2023
అయితే అతని ట్వీట్ కు రియాక్ట్ అయిన వర్మ.. ‘నేను x నుంచి xxx వరకు ప్రతిదీ అర్థం చేసుకున్నాను. కానీ మీరు, మీ ఛానెల్ @abntvtelugu హింసను రెచ్చగొట్టే వాక్చాతుర్యాన్ని.. ముందస్తు ఒప్పందం హత్యల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నారా? అని నాకు అనుమానం ఉంది’ అంటూ ప్రశ్నించారు. అలాగే ‘మీ సమాచారం కోసం నేను ఆ ఫోటోలు, వీడియోలను నా ట్విట్టర్లో మాత్రమే ఉంచాను. ‘రక్తం మడుగులో శృంగారం’ అంటే మీకు మాత్రమే తెలుసు’ అంటూ వర్మ కామెంట్స్ చేశారు. దీంతో.. ‘ఇది కూడా అర్ధం కాలేదంటే ఎలా.. మళ్ళీ చెబుతున్నా. మీరిచ్చిన ఫిర్యాదును డీజీపీ గారు సాదరంగా స్వీకరించారు కదా.. అది చర్యల రూపంలోకి వస్తే ఏపీలో చాలామంది బాధిత ప్రజలు కూడా వాళ్ల ఫిర్యాదులు డీజీపీ గారికి ఇస్తారు అని ట్వీటాను. మీకేమో sex తప్ప X అంటే అర్థం కాదు. #Vyuham’ అంటూ వెంటక కృష్ణ విమర్శలు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి.