Rajasthan: రాజస్థాన్ ఎడారిలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హనుమాన్ ఘడ్ లో శనివారం రాత్రి వేగంగా వెళుతున్న ఓ కారు రోడ్డు పై నడుచుకుంటూ వెళుతున్న ఒంటెను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఒంటే వెనుక భాగం కారు బానెట్ అద్దం పగలగొట్టుకొని కారులోకి వెళ్లింది. ఒంటె నడుము భాగం వరకు కారు ముందు అద్దంలో ఇరుక్కొని పోవడంతో ఒంటె కారుపైకి ఎక్కినట్లుగా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
राजस्थान : हनुमानगढ़ जिले में ऊंट और कार का एक्सीडेंट। कार की विंड स्क्रीन में फंसा ऊंट, चोटिल हुआ। कार वाले सेफ हैं। pic.twitter.com/IhQPxmF0l9
— Sachin Gupta (@SachinGuptaUP) June 9, 2024
అయితే ఈ ఘటనలో కారులో ఉన్న వారికి, ఒంటెకు కానీ ఎటాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. అనంతరం అటుగా వెళుతున్న కొందరు వ్యక్తులు ఒంటెను కారులో నుంచి బయటకు తప్పించి కాపాడారు. మాములుగా ఎడారి ప్రాంతంలో ఒంటెల వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి కానీ, ఇలా జరగడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పేలుస్తున్నారు.