AP News : ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాధులను వేగంగా పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఏ సమస్యైన్యా సరే తన దృష్టికి వచ్చిందంటే తక్షణమే అధికారులను ఆదేశిస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకటగిరి నుంచి వచ్చిన ఓ ఫిర్యాదుపై తిరుపతి (Tirupati) జిల్లా ఎస్పీతో నేరుగా ఫోన్లో మాట్లాడారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, భారీ శబ్దం చేసే సైలెన్సర్లను బైక్లకు బిగించి వీధుల్లో చక్కర్లు కొట్టే యువతకు కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పలువురు యువకులను (Youth) గుర్తించి వార్నింగ్ ఇచ్చారు. వీధుల్లో బైక్లు వేగంగా నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఫిర్యాదు చేయాలని ప్రజలకు తెలిపారు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు… అర్జీల పరిష్కారంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. pic.twitter.com/rgZ2MK6I7i
— JanaSena Party (@JanaSenaParty) July 27, 2024
Also Read : కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!