The GOAT Movie Trailer : తమిళ స్టార్ తలపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ పై అభిమానుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ మూవీ ట్రైలర్ ఆగస్టు 17న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆగష్టు 17 సాయింత్రం 5 గంటలకు ‘గోట్’ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.
Also Read : రీ రిలీజ్ కానున్న ధనుష్ మ్యూజికల్ హిట్ మూవీ.. ఎప్పుడంటే?
ఈ పోస్టర్ లో విజయ్ చేతిలో గన్ తో స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ లుక్ కాస్త ట్రైలర్ పై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాలో శాంత్, ప్రభుదేవా, కిచ్చా సుదీప్, లైలా, మీనాక్షీ చౌదరి, స్నేహ, యోగిబాబు, జయరాం ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram