Prithviraj Sukumaran’s Aadujeevitham Coming On OTT : ఇటీవల థియేటర్స్ లో రిలీజై రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన మలయాళ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు ఓటీటీ (OTT) లోకి రాబోతుంది. ఇప్పటికే రెండు సార్లు ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా పాడగా.. ఫైనల్ గా ఈ నెల 19 నుంచి ఓటీటీలోకి స్ట్రీమింగ్ కాబోతుంది. ఆ సినిమా మరేదో కాదు.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘The Goat Life (ఆడు జీవితం)’..
ప్రముఖ రచయిత బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా వరల్డ్ వైడ్గా రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తన వన్ మ్యాన్ షోతో అదరగొట్టేసాడు.
Also Read : మరోసారి అమ్మవారి పాత్రలో నయనతార.. ‘అమ్మోరు తల్లి’ సీక్వెల్ అనౌన్స్ చేసిన మేకర్స్!
ఆయన కెరీర్ లోనే బెస్ట్ మూవీస్ లో ‘The Goat Life’ ఒకటిగా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీలోకి రావాల్సింది. పలు అనివార్య కారణాల వల్ల రెండు సార్లు ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు జులై 19 నుంచి నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కానుంది. ఏ మేరకు నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. మలయాళంతో పాటూ తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.