CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి నేరుగా లండన్ వెళ్ళిపోయారు. అక్కడ థేమ్స్ నది, ఆ నది ప్రవహిస్తున్నతీరు, దాని చుట్టూ నగరం అభివృద్ధి, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల గురించి రీసెర్చ్ చేస్తున్నారు. అక్కడ అధికారులతో చర్చలు చేస్తున్నారు. థేమ్స్ రివర్ పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయడానికి కారణం ఆయన హైదరాబాద్ మధ్యలో ఉన్న మూసీ నది మీద ఫోకస్ పెట్టడమే. థేమ్స్ నదిలానే మూసీ నది కూడా హైదరాబాద్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తుంది. కనిపించడానికి డ్రైనేజిలా ఉన్నా అది కూడా నదే. ఇప్పుడు దాన్నే సీఎం రేవంత్ మొత్తం మార్చేయాలనుకుంటున్నారు.
Also Read:తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే..
థేమ్స్ నదిలా మూసీ నది…
మూసీ నదిని మార్చాలని చాలా ప్రభుత్వాలు ట్రై చేశాయి ఇంతకు ముందు. కానీ అవేమీ సక్సెస్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి దాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు. లండన్ థేమ్స్ నది, మన మూసీ నదికి పోలికలు ఉండడంతో ఇప్పుడు దాని మాదిరిగా చేయాలని అనుకుంటున్నారు. అందుకే థేమ్స్ నది చుట్టూ లండన్ నగరం ఎలా అభివృద్ధి జరిగిందో అడిగి తెలుసుకున్నారు. దశాబ్దాలుగా థేమ్స్ నది చుట్టూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి అధికారులు రేవంత్‌కు వివరించారు. అలా చేయడంలో ఎదురైన సవాళ్ళు, వాటికి అక్కడి ప్రభుత్వం, వ్యవస్థులు ఏం చేశాయి, ఎంత ఖర్చయింది లాంటి విషయాలన్నీ చెప్పారు.
విజన్ 2050లో భాగంగా ప్రాజెక్టు…
విజన్ 2050 భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీనది ప్రాజెక్టును చేపట్టాలని ప్రయత్నిస్తున్నారు. నదులు, సరస్సుల తీరం వెంబడి చాలా నగరాలు అభివృద్ధి చెందాయి. హైదరాబాద్‌కు కూడా అలాంటి ప్రత్యేకత ఉంది. మూసీ నది వెంబడి, ఇటు హుస్సేన్ సాగర్ చుట్టూ, ఉస్మాన్ సాగర్ లాంటి నదీ వ్యవస్థ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. దాన్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని రేవంత్ అన్నారు. అందుకే మూసీనదికి పూర్వవైభవం తీసుకురావాలనుకుంటున్నాని తెలిపారు. అదే కనుక జరిగితే హైదరాబాద్ మరింత పవర్ఫుల్ అవుతుందని చెబుతున్నారు.
పోర్ట్ ఆఫ్ అండన్ అథారిటీ హామీ..
హైదరాబాద్ మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టులో తమ పూర్తి సహకారం ఉంటుందని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ ఇచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి అక్కడ పలు సంస్థలతో కూడా సీఎం చర్చలు జరిపారు. వారు కూడా సహకారం అందించేలా మాట్లాడుకున్నారు. ఈ మీటింగ్‌కు రేవంత్ రెడ్డితో పాటూ సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, మూసీ రివర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రాపాలీ, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, ఇన్వెస్ట్ మెంట్స్ అండ్ ప్రమోషన్స్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, సీఎం స్పెషల్ సెక్రెటరీ బి.అజిత్ రెడ్డి, మూసీ రివర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఎస్ఈ వెంకట రమణ హాజరయ్యారు.