Thalapathy Vijay Last Movie : కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ లాస్ట్ మూవీకి సంబంధించి తమిళ మీడియాలో రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. రీసెంట్ గానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ది గోట్’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత తన లాస్ట్ ప్రాజెక్ట్ ని హెచ్.వినోద్ తో చేయబోతున్నాడు. అజిత్ తో వలిమై, తునీవు వంటి హిట్ సినిమాలని తెరకెక్కించిన ఈయన.. విజయ్ కోసం ఓ పొలిటికల్ స్టోరీని రెడీ చేసినట్లు తెలిసింది.
విజయ్ చేయబోయే చివరి సినిమా ఇదే అని ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతున్నా ఈ ప్రాజెక్ట్ పై ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించగా.. తాజాగా ఈ సినిమాలో విజయ్ తో సమంత, కీర్తి సురేష్ ఇద్దరూ జతకట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సమంత విజయ్ తో ఇప్పటికే కత్తి, తేరి, మెర్సల్ వంటి సినిమాల్లో నటించింది. అటు కీర్తి సురేష్ సైతం భైరవ, సర్కార్ సినిమాల్లో విజయ్ తో జత కట్టింది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు హీరోయిన్స్ విజయ్ లాస్ట్ మూవీలో నటించబోతున్నారట. ప్రస్తుతానికి దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా కోలీవుడ్ సర్కిల్స్ లో ఈ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి మొదట ఈ ప్రాజెక్ట్ ని DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య నిర్మించాల్సింది. కానీ పలు అనివార్య కారణాల వల్ల దానయ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. ఆస్థానంలో సన్ పిక్చర్స్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం.
Also Read : ‘రామాయణ’ సెట్స్ నుంచి రన్ బీర్, సాయి పల్లవి లుక్స్ లీక్.. నెట్టింట వైరల్