ఢిల్లీలోని భారత మండపం వేదికగా దేశంలోని అతిపెద్ద టెక్స్టైల్స్-2024 ఈవెంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ వేడుకకు సుమారు 100 దేశాల నుంచి మూడు వేలకు పైగా కొనుగోలుదారులు, ఎగ్జిహబిటర్లు, అలాగే 40 వేల మంది వాణిజ్య సందర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్స్టైల్స్ రంగం భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కీలకంగా మారిందని పేర్కొన్నారు.
Also Read: దేశవ్యాప్తంగా 553 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభం..తెలుగు రాష్ట్రాల్లో ఇవే.
వికసిత్ భారత్
‘ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఆ సమయానికి దేశ అభివృద్ధిలో టెక్స్టైల్స్ రంగం కీలక పాత్ర పోషించనుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహాకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంది. 2014లో భారత్ టెక్స్టైల్స్ మార్కెట్ విలువ రూ.7 లక్షల కోట్ల కన్న తక్కువగానే ఉంది. ఇప్పుడది రూ.12 లక్షల కోట్లకు చేరుకుంది. రాబోయే రోజుల్లో వికసిత్ భారత్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించినట్లు’ ప్రధాని మోదీ తెలిపారు.
అలాంటి సమాజం కావాలి
వికసిత్ భారత్‌కు రైతులు, పేదలు, మహిళలు, యువత ముఖ్య స్తంభాలని.. వీళ్లతోనే టెక్స్టైల్స్ రంగం ముడిపడి ఉందని పేర్కొన్నారు. అందుకే ఈ కార్యక్రమం ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండేటటువంటి సమాజాన్ని సృష్టించడమే తన లక్ష్యమని చెప్పారు. ఇది ప్రజల శ్రేయస్సుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని.. ఇందుకోసం 10 ఏళ్లుగా పోరాడుతున్నానని వ్యాఖ్యానించారు. రాబోయే ఐదేళ్లలో ఈ జోక్యాన్ని పూర్తిగా తగ్గిస్తానని హామీ ఇచ్చారు.
Also Read: ప్రముఖ సింగర్ కన్నుమూత!