RS Praveen meeting: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో బీఎస్పీ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో అపశృతి చోటు చేసుకుంది. ఒకసారిగా ప్రజా ఆశీర్వాద సభ వేదిక కుప్పకూలింది. భారీ గాలి దుమారం రావడంతో బీఎస్పీ ఏర్పాటు చేసిన సభ వేదిక కుప్పకూలింది. అయితే.. సభా వేదిక దగ్గర ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి. అలాగే ఇనుప బొంగులు తాకి పలువురు కార్యకర్తలు మరియు నాయకులకు గాయాలు అయినట్లు సమాచారం. ఇక వెంటనే ఈ సంఘటనలో గాయపడిన వారిని కార్యకర్తలు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే.. ఈ సంఘటన జరిగిన సమయంలో బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. అయితే.. ఈ ఘటనలో ప్రవీణ్ కుమార్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.
మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోవడంతో 15 మందికి గాయాలయ్యాయి. ఈ సభకు బీఎస్పీ చీఫ్ డా. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు రెండు నియోజకవర్గాల అభ్యర్థులు వచ్చారు. భారీగా ప్రజలు తరలిరాగా.. వారి కోసం పెద్ద ఎత్తున షామియానాలను ఏర్పాటు చేశారు పార్టీ నాయకులు. అయితే.. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే షామియానాలు కూలిపోవడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సభకు హాజరైన జనం భయంతో చెల్లాచెదురై పారిపోయే యత్నం చేశారు. డాక్టర్ ప్రవీణ్‌కుమార్ గాయపడిన వారిని పరామర్శించారు. టెంట్లు సరిగ్గా వేయకపోవడం వల్లనే కూలిపోయాయని ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. ఇక ఈ సంఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.