TSRTC: బిజినెస్ రంగంలో రాణించాలనుకుంటున్నవారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బస్టాండుల్లో ప్రయాణికులకు అవసరమైన వస్తువులు విక్రయించేందుకు గానూ పలు దుకాణాలను నిర్వహించుకునేందుకు బంఫర్ ఆఫర్ ఇచ్చింది. అంతేకాదు పెట్రోలు బంకులు, వర్క్ షాప్స్, క్యాంటీన్ తదితర వ్యాపారాలు నడిపించుకునేందుకు గానూ అవకాశం కల్పించారు. అయితే ఈ టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా వివరాలు ఇలా ఉన్నాయి.
TSRTC invites tenders from interested persons for commercial contracts like fuel outlets, stalls, parking lots, logistic services, etc.@TSRTCHQ @PROTSRTC @SajjanarVC @PonnamLoksabha pic.twitter.com/tPnIRN4MpJ
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) December 24, 2023
ఈ మేరకు No. PR1/9(35)/2023-24-PRD ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని ఈ క్రింద పేర్కొన్న వాటికి కాంట్రక్టర్ల నియామకానికి ఆసక్తిగల బిడ్డర్ల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు.
1. అదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజమాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్లలోని వివిధ బస్ స్టేషన్లతోపాటు హైదరాబాద్ లోని తార్నాక ఆసుపత్రిలో ఖాళీ షాపులు/స్థలాలు/ క్యాంటీన్/పార్కింగ్ స్థలాల నిర్వహణ కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు.
2. తెలంగాణలోని 33 స్థాలలో పెట్రోలు బంకులు నెలకొల్పుటకు, నడుపుట కోరకు సర్వీస్ ప్రొవైడర్ల నియామకానికి అవకాశం.
3. మహబూబ్ నగర్, నల్లగొండ రీజియన్లలోని బస్ డిపోలు/ బస్ స్టేషన్లలో లాజిస్టిక్స్ సర్వీసెస్ నిర్వహణ.
4. మహాబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి రీజియన్ల లోని బస్ డిపోలు/ బస్ స్టేషన్లతోపాటు జోనల్ వర్క్ షాప్, ఉప్పల్ లో అవుట్ సోర్సింగ్ ద్వారా వివిధ రకాల విధులు నిర్వహించుట కోరకు టెండర్లు ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి : లంచాలతోనే ఆఫీసుకు రండి.. ఏపీలో తహసిల్దార్ నిర్వాకం.. వీడియో వైరల్
ఆసక్తిగల వారు టెండర్ ప్రకటన కోసం తేది : 24-12-2023 నుంచి http://tsrtc,telangana.gov.in (Tenders) ఆన్ లైన్ ద్వారా టెండర్ లో పాల్గొనుటకు http:// tender. telangana.gov.in ను సంప్రదించవలసిందిగా సంబంధిత అధికారులు సూచించారు.