Telangana 20 IPS Transferred: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఉన్నత స్థాయి అధికారులందరికీ స్థానచలనం చేసింది. తెలంగాణ డీజీపీగా రవిగుప్తను కొనసాగించింది. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్. రైల్వే డీజీగా మహేశ్ భగవత్. సీఐడీ చీఫ్ గా శిఖాగోయల్, జైళ్లు డీజీగా సౌమ్యామిశ్రా, ఎస్ఐబీ చీఫ్‌గా సుమతి, సీఐడీ డీఐజీగా రమేష్ నాయకుడు, ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ నియమించింది.
బదిలీ అయిన అధికారుల వివరాలు..
☛ రవిగుప్తాను డీజీపీగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
☛ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న మాజీ డీజీపీ అంజనీకుమార్ రోడ్డు సెఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా బదిలీ. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు.
☛ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా రాజీవ్ పఠాన్.
☛ ఏసీబీ డీజీగా సీనియర్ ఐపీఎస్ సీవీ ఆనంద్.
☛ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్.
☛ జైళ్ళ శాఖ డీజీగా డాక్టర్ సౌమ్య మిశ్రా.
☛ సీఐడీ అదనపు డీజీగా శిఖాగోయల్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు.
☛ రైల్వేస్, రోడ్డు సెఫ్టీ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్.
☛ తెలంగాణ ఎస్పీఎఫ్ డీజీగా డాక్టర్ అనీల్ కుమార్.
☛ తెలంగాణ హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర.
☛ హైదరాబాద్ మల్టీ జోన్-2 ఐజీగా డాక్టర్ తరుణ్ జోషి.
☛ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా విబి కమలాసన్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు.
☛ ఎసీబీ డైరెక్టర్‌గా ఎఆర్ శ్రీనివాస్.
☛ తెలంగాణ పర్సనల్ ఐజీగా చంద్రశేఖర్ రెడ్డి.
☛ స్టేట్ పోలిస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా రమేష్‌కు పూర్తి అదనపు బాధ్యతలు.
☛ సీఐడీ డీఐజీగా కె రమేష్ నాయుడు.
☛ హెడ్‌క్వార్టర్స్ జాయింట్ కమిషనర్‌గా వి. సత్యనారాయణ.
☛ డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఎం. శ్రీనివాసులకు ఆదేశాలు.
☛ ఎస్ఐబి ఇంటిలిజెన్స్ డీఐజీగా బి. సుమతి.
☛ హైదరాబాద్ సిటీ సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్‌గా శరత్ చంద్ర పవార్.
I extend my heartfelt gratitude to all the #TelanganaPolice force for your unwavering dedication and exceptional efforts during the #TelanganaElections. Your tireless work, especially today, has not gone unnoticed. Thank you for ensuring the smooth conduct of the elections and… pic.twitter.com/OF4geJOmOF
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) November 30, 2023
బదిలీ అయిన అధికారులకు సంబంధించి పూర్తి వివరాలను ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
Also Read:
కొత్త రేషన్ కార్డులపై సర్కార్ కీలక నిర్ణయం.. డిసెంబర్ 28 నుంచే దరఖాస్తులు..!