Telangana Election Nominations: తెలంగాణలో నామినేషన్ల ఘట్టం పూర్తయ్యింది. గడువు తేదీలోపు దాఖలైన నామినేషన్ల లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు మొత్తం 5,716 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. అయితే, అభ్యర్థుల పరంగా చూసుకున్నట్లయితే.. 4,798 మంది అభ్యర్థులు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు.
అత్యధికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో, మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్ నియోజకవర్గంలో 145 మంది అభ్యర్థులు 154 నామినేషన్లు వేశారు. రెండవ స్థానంలో మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ అత్యధికంగా 116 మంది అభ్యర్థులు 127 నామినేషన్లు ఫైల్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇక కామారెడ్డి నియోజకవర్గంలో 92 మంది ఏకంగా 104 నామినేషన్లు వేశారు. దాంతో ఈ మూడు నియోజకవర్గాల్లోనే అత్యధికంగా నామినేషన్లు నమోదయ్యాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగానే అభ్యర్థులు కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గా్ల్లో ఎక్కువ నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది. నామినేషన్లు వేసిన వారిలో వందకుపైగా రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి ప్లాట్స్ బాధితులు, రైతులు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించాలని రైతులు నామినేషన్లు వేశారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున 30కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్‌లో ఏకంగా 154 నామినేషన్లు పడటంతో.. గులాబీ పార్టీ అలర్ట్ అయ్యింది. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన బాధితులను నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నిజామాబాద్ నుంచి చాలా మంది రైతులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఇక తెలంగాణలో అత్యల్పంగా నామినేషన్లు దాఖలైన నియోజకవర్గం నారాయణపేట. ఇక్కడ కేవలం 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. య్యాయి. మక్తల్ నియోజకవర్గం 19, వైరా నియోజకవర్గంలో 19 మంది చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. బాల్కొండ 20, నిజామాబాద్ రూరల్ 22, దేవరకద్ర 22, బహదూర్‌పుర 22, నిజామాబాద్ రూరల్ 22, బోథ్ 22, భద్రాచలం 23, కొడంగల్ 23, ములుగు 24, డోర్నకల్ 24 చొప్పున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
15 తరువాత తేలనున్న లెక్కలు..
ప్రస్తుతానికి భారీగానే నామినేషన్లు దాఖలైనా.. నామినేషన్ల ఉపసంహరణ గడువైన 15వ తేదీ తరువాత అసలు లెక్కలు తేలుతాయి. 15 తరువాత ఉన్న అభ్యర్థులంతా ఎన్నికల బరిలో ఉంటారు. ఎందుకంటే.. ఈ మధ్యలో అధికారుల పరిశీలినలో రిజెక్ట్ అయ్యే నామినేషన్లు కొన్ని ఉంటే.. నామినేషన్లను ఉపసంహరించుకునేవారు కొందరు ఉంటారు.
నామినేషన్ల ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Also Read: