CM Revanth Reddy: అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార పార్టీ, ప్రతికపక్షాల నడుమ మాటల యుద్ధం నడుస్తోంది. కాగా ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. బతుకమ్మ చీరలు (Bathukamma Sarees), గొర్రెల స్కీమ్ (Sheep Distribution Scheme), కేసీఆర్ కిట్లు పథకాల (KCR Kits) అవకతవకలపై విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ ఆరోపించారు. గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి చేశారని అన్నారు. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లలోనూ భారీగా అవినీతి జరిగిందని చెప్పారు. సూరత్ నుంచి నాసిరకం చీరలు తీసుకొచ్చి తెలంగాణ మహిళలకు ఇచ్చారని అన్నారు. రూ.వేలకోట్ల భూములను అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. సభలో అన్ని లెక్కలు బయటకు తీస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
Telangana Assembly Sessions 2024
KCR: రేపు అసెంబ్లీకి కేసీఆర్
Telangana Assembly Session: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ప్రతిపక్షనేత కేసీఆర్ (KCR) రేపు అసెంబ్లీకి రానున్నారు. రేపు ప్రభుత్వం బడ్జెట్ (Telangana Budget 2024) ప్రవేశ పెట్టనుంది. దీంతో కేసీఆర్ సభకు హాజరై ఇందుకు సంబంధించిన చర్చలో ఆయన పాల్గొననున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ సభకు ఒక్కసారి కూడా హాజరుకాలేదు. రేపు ప్రతిపక్షనాయకుడి హోదాలో కేసీఆర్ తొలిసారిగా సభకు హాజరుకానున్నారు. దీంతో కేసీఆర్ ఏం మాట్లాడుతారు? రేవంత్ సర్కార్ పై ఎలాంటి విమర్శలు చేస్తారు? అన్న అంశంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: Telangana: బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిచ్చింది.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెంది.. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతారా? కారా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఓ దశలో కేసీఆర్ పార్లమెంట్ కు పోటీ చేస్తారన్న ప్రచారం కూడా సాగింది. ఎంపీగా విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న చర్చ సాగింది. అయితే.. ఆయన ఎంపీగా పోటీ చేయకపోవడంతో ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. కాంగ్రెస్ నాయకులు సైతం కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని అనేక సార్లు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సైతం కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కేసీఆర్ హాజరుకాకపోవడంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రేపు హాజరవుతుండడంతో అసెంబ్లీలో రేవంత్, కేసీఆర్ మధ్య మాటల తూటాలు పేలే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశం, విద్యుత కొనుగోళ్ల అంశాలపై సైతం కేసీఆర్ అసెంబ్లీ నుంచి క్లారిటీ ఇస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ హాజరైతే రేపటి నుంచి శాసనసభ మరింత రసవత్తరంగా సాగే అవకాశం ఉందన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.
ఇది కూడా చదవండి: Ponguleti Srinivasa Reddy: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ గ్యారెంటీ స్కామ్.. మేఘా, పొంగులేటిపై సీబీఐ ఎంక్వయిరీ డిమాండ్!
Telangana: బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిచ్చింది అంటూ విమర్శించారు. ‘ 2018లో పార్లమెంట్లో అవిశ్వాస తీర్మాణం పెడితే మోదీకి మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసింది. 2019లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ చట్టానికి మద్దతుగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ ప్రత్యేక విమానంలో వెళ్లి ఓటింగ్లో పాల్గొన్నారు.
Also Read: జగన్ పై సీఐడీ విచారణ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం
అసెంబ్లీ సాక్షిగా నోట్ల రద్దును కేసీఆర్ స్వాగతించారు. గొప్ప నిర్ణయమని పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీజేపీకి అండగా బీఆర్ఎస్ నిలబడింది. అన్నింట్లో మద్దతు పలికి కేంద్రంపై పోరాటాలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలోనూ బీజేపీకి అనుకూలంగా ఉండేలా బీఆరెస్ వ్యవహరించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలోనూ బీజేపీకి మద్దతిచ్చారు.
సాగు చట్టాల విషయంలోనూ బీఆర్ఎస్.. బీజేపీకి అండగా నిలిచింది. కేంద్రం నుంచి నిధులు కాదు.. మోదీ ప్రేమ ఉంటే చాలు అని ఆనాడు తెలంగాణ ప్రజల సాక్షిగా కేసీఆర్ మాట్లాడారు. అదానీ, అంబానీలతో చీకట్లో కుమ్మక్కయ్యే అవసరం మాకు లేదు. సభ నిర్వహించేది గాలి మాటలు మాట్లడటానికి కాదు. రాష్ట్రం దివాళా తీయడానికి కారణం బీఆరెస్ పదేళ్ల పాలనే. ప్రతీ శాఖలో బిల్లులన్నీ పెండిగ్ వాళ్లు పెట్టారు. మీరేం చేశారో చూసే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇంకా అహంకారంతో ఇతరులను కించపరిచేలా మాట్లాడటం మంచిది కాదు. గుండుసున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా ?. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ముందుకు రావాలని కోరుతున్నానంటూ’ సీఎం రేవంత్ అన్నారు.
Telangana Assembly: కేసీఆర్ ఎక్కడ దాక్కున్నావ్.. అసెంబ్లీలో రెచ్చిపోయిన సీఎం రేవంత్
CM Revanth Reddy Comments On KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి (Telangana Assembly) రాకపోవడంపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ (KCR) ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారని అనుకున్నామని అన్నారు సీఎం రేవంత్. కానీ, ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం సభను అవమానించడమే అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులను సరి చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. తెలంగాణ అంటే ఓకే ఎమోషన్ అని అన్నారు.
అందరం టీజీ అనే అనుకున్నాం…
తెలంగాణ ఉద్యమంలో అందరం టీజీ (TG) అని రాసుకునేవాళ్లం అని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). కేంద్రం కూడా తమ నోటిఫికేషన్లో టీజీ అని పేర్కొంది అని వివరించారు. అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫరించేలా టీఎస్ అని పెట్టిందని ఫైర్ అయ్యారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ట్ర అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
అందుకే తెలంగాణ తల్లి విగ్రహం మార్పు…
రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాజరిక ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు సీఎం రేవంత్. ప్రజాస్వామ్య పాలనలో రాజరికం ఉండకూడదని భావిస్తున్నాం అని అందుకే రాష్ట్ర చిహ్నంలో (State Symbol) మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ తల్లి (Telangana Talli Statue) అంటే.. మనకు అమ్మ, అక్క, చెల్లి గుర్తుకు రావాలని అన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని ఉండలేదని అన్నారు. తెలంగాణ తల్లి శ్రమజీవికి ప్రతీకగా ఉండాలని తెలిపారు.
ఇంకా నెరవేరలేదు…
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా ప్రజలు కన్నా కలలు ఇంకా నెరవేరలేదని అన్నారు. తెలంగాణ అంటే మనకు ఒక ఎమోషన్ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.