తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) మరో కీలక ఘట్టమైన నామినేసన్ల ఉపసంహరణ గడువు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. రెబల్స్ గా బరిలోకి దిగిన అనేక మంది నామినేషన్లను ఉపసంహరించుకునేలా కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇందుకోసం రోహిత్ చౌదరి, మల్లురవి లాంటి కీలక నేతలు రంగంలోకి దిగి చర్చలు జరిపారు. ముఖ్యంగా సూర్యాపేటలో రమేష్ రెడ్డి (Patel Ramesh Reddy) నామినేషన్ ఉపసంహరణ సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. చర్చలు జరపడానికి వచ్చిన మల్లు రవిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం సంచలనంగా మారింది. రమేష్ రెడ్డి నామినేషన్ ఉప సంహరణకు అంగీకరించినా.. కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎట్టకేలకు నామినేషన్ ఉపసంహరించుకున్న రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడి.. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేకుండా పోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హైకమాండ్ తో పాటు స్థానిక నేతలు హామీ ఇచ్చారని తెలిపారు. పార్టీ పెద్దల మాటను గౌరవించి నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: CM KCR: మైనంపల్లి రోహిత్ ఓ దిష్టి బొమ్మ.. మెదక్ మీటింగ్ లో కేసీఆర్ సెటైర్లు!
ఈ రోజు నామినేషన్ విత్ డ్రా చేసుకున్న కాంగ్రెస్ రెబల్స్ వీరే..
బాన్సువాడ – కాసుల బాలరాజ్,
జుక్కల్ – గంగారాం,
వరంగల్ వెస్ట్ – జంగా రాఘవరెడ్డి,
డోర్నకల్ – నెహ్రూ నాయక్,
ఇబ్రహీంపట్నం – దండెం రామిరెడ్డి,
పినపాక – విజయ్ గాంధీ,
వైరా – రామ్మూర్తి నాయక్.