TS Politics: రేవంత్ రెడ్డి బాధితులతో సంఘం.. కొడంగల్ లో 500 మందితో ప్రచారం: సోమశేఖర్‌రెడ్డి సంచలన ఇంటర్వ్యూ కాంగ్రెస్ ఓడిపోవాలనే ఉప్పల్‌లో తనకు టికెట్ ఇవ్వలేదని సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డిపై తీవ్ర వాఖ్యలు చేశారు. రేపు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. By Nikhil 26 Oct 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై (Revanth Reddy) సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అందరినీ వాడుకుని వదిలేసే రకమంటూ ధ్వజమెత్తారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 500 మందితో ప్రచారం చేస్తానని ప్రకటించారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఓడిపోవాలనే ఉప్పల్‌లో తనకు టికెట్ ఇవ్వలేదని సంచలన ఆరోపణలు చేశారు సోమశేఖర్ రెడ్డి. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్ సీఎం అయితే రాష్ట్రాన్నే అమ్మేస్తాడంటూ దుమ్మెత్తిపోశారు. రేవంత్ తనను టిష్యూపేపర్‌లా వాడుకుని వదిలేశాడని ఫైర్ అయ్యారు సింగిరెడ్డి. రేవంత్ రెడ్డి బాధితులతో కలిసి సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రేపు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్నానని ప్రకటించారు. సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి. #telangana-elections-2023 #telangan-politics సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి