ఈ సందర్బంగా విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సీనియర్ నేత (TDP Senior Leader) బుద్దా వెంకన్న (Buddha Venkanna) వైసీపీ నేతల(YCP Leaders)పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో ఎక్కడా లేని రెండు చట్టాలు ఎపీలో మాత్రమే అమలవుతున్నాయని ఆయన ఆరోపించారు. కొడాలి నానీ (Kodali Nani).. నారా చంద్రబాబు నాయుడు (Chandrababu), అతని కుటుంబ సభ్యులపై ఎన్ని అయినా వాగొచ్చు..!! నోరేసుకుని మాట్లాడినా..!! వారిపై కేసులు ఉండవు.. అరెస్టు చేయరు. వారి వ్యాఖ్యలను తప్పు బడితే.. తమపై కేసులు పెడతారా.? అని ప్రశ్నించారు. పేర్ని నాని కేసులు పెడితే.. పోలీసులు నమోదు చేశారు. తాను కొడాలి నాని, వంశీని విమర్శిస్తే.. పేర్ని నానికి ఏంటి నొప్పని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. పేర్ని నానీ.. నేను నీ గురించి మాట్లాడితే నీ చెవిలో నుంచి రక్తం కారుతుంది.. గుర్తు పెట్టుకో అంటూ మండిపడ్డారు.
ఛీ కొడుతున్నారు..
సీఎం జగన్ నేరం చేశారు కాబట్టి బెయిల్ పిటీషన్ (Bail Petition) వేశారు. చంద్రబాబు నేరం చేయలేదు కాబట్టి.. క్వాష్ పిటీషన్ వేశారు. అది కూడా తెలియని వారు మంత్రులుగా పని చేశారని బుద్దా వెంకన్న విమర్శించారు. కొడాలి నానీ వ్యాఖ్యలపై ప్రజలు ఛీ కొడుతున్నారు. అయినా.. నానీకి సిగ్గు రావడలేదని ఆరోపించారు. వైసీపీ నేతలు కూడా ఛీ కొడుతున్నారన్నారు. 2004లో హరికృష్ణ పార్టీలో లేరు. టీడీపీ టిక్కెట్ ఇచ్చి చంద్రబాబు భిక్ష పెట్టారన్నారని గుర్తు చేశారు. హరికృష్ణ తన ప్రాణం అనే నానీ.. ఆయనతో లేకుండా 2004లో టీడీపీలోకి ఎందుకు వచ్చావ్..? అని ప్రశ్నించారు. చంద్రబాబు వెన్నుపోటు దారుడని చెప్పిన నానీ.. ఆయన సంతకంతో ఉన్న బీఫాం అప్పుడు ఎందుకు తీసుకున్నావ్.. అని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
పేదలకు ఉద్యోగాలు ఇవ్వు
2024 ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రాగానే బెజవాడ బెంజిసెంటర్లో వాగిన కుక్కలను మోకాళ్ళ మీద నడిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ స్తంభాలకు ఈ కుక్కలను కట్టేస్తామని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి చేయలేదని.. జగన్ దుర్మార్గంతో జైలుకు పంపారని బుద్దా వెంకన్న ఆరోపించారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు వ్యాపార వ్యక్తులు. వాళ్ళ కష్టపడి కంపెనీని నడిపిస్తున్నారు. శాంతి భద్రతకు విఘాతం కల్గించే వ్యక్తి జగన్ అని ఫైర్ అయ్యారు. నీకు దమ్ముంటే కేంద్ర హోంమంత్రి వద్దకు వెళ్ళి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడూ అంటూ సవాల్ చేశారు. పేదలకు అమ్మఒడి వద్దు..? పేదలకు ఉద్యోగాలు ఇవ్వు..? అప్పుడే వారి కుటుంబం బాగుపడుతుదని బుద్ధా వెంకన్న ధ్వసజమెత్తారు.
ఇది కూడా చదవండి: బండారుపై రోజా సీరియస్ యాక్షన్.. కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి