TDP MLA Julakanti Brahma Reddy : మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయన్నారు. ఏపీ భవిష్యత్తుకు, యువతకు భరోసా ఇచ్చే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఎన్నికల్లో అరాచక ప్రభుత్వానికి స్వస్తి చెప్పి ప్రజలు కూటమిని గెలిపించారన్నారు. మాచర్లలో ఎన్నడూ లేని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. పిన్నెల్లికి వ్యవస్థలంటే గౌరవం లేదని.. అతడికి శాసనసభ్యుడిగా శాశ్వతంగా అనర్హత వేటు విధించాలని కామెంట్స్ చేశారు.
TDP Julakanti Brahma Reddy
Brahma Reddy: పిన్నెల్లికి ఇలా చేయడం అలవాటే.. బ్రహ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
TDP Julakanti Brahma Reddy: గుంటూరు జిల్లా మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ప్రతి గొడవ వెనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రతి కేసులో పిన్నెల్లి సోదరులను నిందితులుగా చేర్చాలన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనర్హత వేటు వెయ్యాలని డిమాండ్ చేశారు.
Also Read: ఇలా చేయడం దురదృష్టకరం.. జగన్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి..!
మొదట్లో టీడీపీ నేతలకు పోలీసులు సహకరించారన్నారని..ఇప్పడు ఆయనే ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటపడిందని కామెంట్స్ చేశారు. అబద్దాలు చెప్పడం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అలవాటే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్లలో కులాల కుంపట్లు పెట్టి రాజకీయం చేయడం పిన్నెల్లి నైజం అంటూ మండిపడ్డారు.