TATA Punch EV: టాటా మోటార్స్ తన సరికొత్త టాటా పంచ్ EVని శుక్రవారం (జనవరి 5) ఆవిష్కరించింది. ఈ కారు ఫుల్ ఛార్జింగ్ తో 300 నుంచి 400 కి.మీ వరకు నడుస్తుందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ ప్యాక్‌పై రేంజ్ ఆధారపడి ఉంటుంది. పంచ్ EV బుకింగ్ నేటి నుంచి ప్రారంభం అవుతోంది. 21,000 టోకెన్ మనీ చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు. టాటా పంచ్ EV సిట్రోయెన్ eC3తో పోటీపడుతుంది. ఇది Nexon EV – Tiago EV మధ్య రేంజ్ లో ఉంటుంది. అంటే, దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 10 లక్షల నుంచి 13 లక్షల మధ్య ఉండవచ్చు.
Tata Punch EV రెండు వేరియంట్లలో..
Tata Punch EV రెండు వేరియంట్లలో లాంచ్ చేశారు. – స్టాండర్డ్ అలాగే లాంగ్ రేంజ్. స్టాండర్డ్‌లో 25kWh బ్యాటరీ ప్యాక్ తోనూ.. లాంగ్ రేంజ్ 35kWh బ్యాటరీ ప్యాక్‌తోనూ వస్తుందని భావిస్తున్నారు. స్టాండర్డ్‌లో 3.3kW AC ఛార్జర్ మాత్రమే అందుబాటులో ఉంది, అయితే లాంగ్ రేంజ్ 7.2kW AC ఛార్జర్‌తో పాటు 150kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.
ప్రామాణిక Tata Punch EV 5 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది – స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్+. ఇది 5 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. లాంగ్ రేంజ్ లో మూడు ట్రిమ్‌లు అందుబాటులో ఉన్నాయి – అడ్వెంచర్, ఎంపవర్, ఎంపవర్+. ఇందులో 4 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.
డిజైన్..
Punch EV ముందు భాగంలో పూర్తి-వెడల్పు LED లైట్ బార్ – స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంది. ఇక్కడ ప్రధాన హెడ్‌ల్యాంప్ Nexon EV లాగా ఉంటుంది. దీనితో పాటు, ముందు భాగంలో ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. ఇలా కంపెనీ నుంచి వచ్చిన ఈవీలలో పంచ్ EV మొదటిది. దీని కింద పూర్తిగా కొత్తగా డిజైన్ చేసిన బంపర్ ఉంది.
వెనుక భాగంలో Y- ఆకారపు బ్రేక్ లైట్ సెటప్, రూఫ్ స్పాయిలర్.. డ్యూయల్-టోన్ బంపర్ డిజైన్ ఉన్నాయి. 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లతో అందుబాటులో ఉంటాయి. ఇది స్టోరేజ్ కోసం బానెట్ కింద ట్రంక్ కలిగి ఉంటుంది.
Also Read: భారత జీడీపీ పరుగులు తీస్తుంది అంటున్న ప్రభుత్వం
ఇంటీరియర్, ఫీచర్లు
పంచ్ EV డాష్‌బోర్డ్ హైలైట్ కొత్త 10.25-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. ఇందులో 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ – పెద్ద టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా ఉన్నాయి. అయితే, దిగువ వేరియంట్లో 7.0-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ – డిజిటల్ క్లస్టర్ ఉంటుంది. Nexon EVలో కనిపించే రోటరీ డ్రైవ్ సెలెక్టర్ లాంగ్ రేంజ్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఇది కాకుండా, Tata Punch EVకి 360-డిగ్రీ కెమెరా, లెథెరెట్ సీట్లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కనెక్ట్ చేసిన కార్ టెక్, వైర్లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్ అలాగే కొత్త Arcade.ev యాప్ సూట్ లభిస్తాయి. సన్‌రూఫ్ ఎంపికగా కూడా అందుబాటులో ఉంది.
సేఫ్టీ ఫీచర్లు..
Tata Punch EV భద్రత కోసం, అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS – ESC కలిగి ఉంటుంది. ఇది బ్లైండ్ వ్యూ మానిటర్, అన్ని సీట్లకు మూడు-పాయింట్ సీట్ బెల్ట్‌లు, ISOFIX మౌంట్ – SOS ఫంక్షన్‌ను పొందుతుంది.
టాటా పోర్ట్‌ఫోలియోలో నాల్గవ ఆల్-ఎలక్ట్రిక్ కారు
Tata Punch EV భారతదేశం అతి చిన్న ఎలక్ట్రిక్ SUV. ఇది టాటా పోర్ట్‌ఫోలియోలో నాల్గవ ఆల్-ఎలక్ట్రిక్ కారుగా నిలుస్తోంది. . నెక్సాన్ తర్వాత ఇది టాటా రెండవ ఎలక్ట్రిక్ SUV. జనరేషన్ 2 EV ఆర్కిటెక్చర్‌పై అభివృద్ధి చేసిన టాటా మొదటి మోడల్ ఇది.
Watch this interesting Video: