రతన్ కు టాటా కంపెనీ కారు నచ్చదు.. ఆయన ఫేవరెట్ కారు ఏంటో తెలుసా?

రతన్ టాటా తన కంపెనీ కార్లను వాడకుండా ప్రత్యర్థి కంపెనీ హోండా సిటీ కారు వాడడం అప్పట్లో చర్చకు దారి తీసింది. కాగా హోండా సిటీ కారు తనకు ఫెవరెట్ కార్ అని బహిరంగంగానే చెప్పారు. చనిపోయే వరకు కూడా ఆ కారునే తానే డ్రైవ్ చేసుకున్నారు రతన్ టాటా.

New Update
tata honda

Ratan Tata: లక్షల కోట్ల ఆస్తి ఉన్నా సామాన్యుడిగానే రతన్ టాటా తన జీవితాన్ని కొనసాగించారు. చనిపోయే వరకు కారును తానే డ్రైవ్ చేసుకున్నారు. సొంత కంపెనీ నుంచి జాగ్వార్, ల్యాండ్ రోవర్ లాంటి లగ్జరీ కార్లున్నా ఏనాడు వాటిని  పట్టించుకోలేదు. తాను చనిపోయేంత వరకు ప్రత్యర్థి కంపెనీ హోండా సిటీ కారు మాత్రమే ఆయన వాడారు. తన ఫేవరెట్ కారు హోండా సిటీ అని ఓపెన్‌గా చెప్పారు రతన్ టాటా.

అవమానించినవారే సెల్యూట్ చేశారు...

టాటా ఇండికా వచ్చిన కొత్తలో నష్టాల్లో ఉంటే అమెరికాకి చెందిన ఫోర్డ్ మోటార్స్ కి వెళ్ళి అమ్ముతాం కొనమని అడిగితే వాళ్ళు ఎగతాళి గా మాట్లాడి పంపించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అదే ఫోర్డ్ మోటార్స్ నష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించి ఫోర్డ్ వాళ్ళ లగ్జరీ కార్లు అయిన "జాగ్వార్", "లాండ్ రోవర్" ని 2008లో కొని ఫోర్డ్ మోటార్స్ కి సహాయం చేశాడు రతన్ టాటా.

Also Read :  రతన్ టాటా కలలుగన్న నానో కారు.. ఫెయిల్యూర్ ఎందుకైందో తెలుసా?

Advertisment
తాజా కథనాలు