Cine Field : ఒకప్పుడు తెలుగు అమ్మాయి(Telugu Ammai) లకు కొన్ని పరిమితులు ఉండడం వల్ల సినిమా రంగంలోకి అంతగా ఎంట్రీ ఇచ్చే వారు కాదు. కానీ, ఇప్పుడు చాలా మంది భామలు గ్లామర్ షో(Glamour Show) కు సిద్ధం అవుతుండడంతో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడలా సందడి చేస్తోన్న బ్యూటీల్లో యాంకర్ స్రవంతి చోకారపు(Anchor Sravanthi Chokarapu) ఒకరు.
స్రవంతి చోకారపు ఉద్యోగం చేసుకునేందుకు హైదరాబాద్(Hyderabad) వచ్చిన సమయంలోనే అనుకోకుండా ఓ సినిమాలో చిన్న పాత్రను చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆమె సినిమాల వైపు ప్రయాణం సాగించింది.
స్రవంతి ఆరంభంలోనే కొన్ని మూవీల్లో కనిపించింది. అలా చాలా కాలం పాటు కంటిన్యూ చేసింది. కానీ, స్రవంతికి రావాల్సిన గుర్తింపు మాత్రం దక్కలేదనే చెప్పుకోవాలి.
సినిమాల్లో అంతగా సక్సెస్ కాలేకపోయిన స్రవంతి.. ఆ తర్వాత యాంకర్‌గా కొత్త అవతారం ఎత్తింది. ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు చానెళ్లలో ప్రసారం అయిన కొన్ని షోలను హోస్ట్ చేసింది.
స్రవంతి హోస్ట్ చేసిన వాటిలో ‘బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్’ మాత్రమే హైలైట్ అయింది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన ఆమె సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తోంది.
కెరీర్ ఆరంభంలోనే యాంకర్ స్రవంతి చోకారపు.. చాలా ఏళ్ల క్రితమే ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లకు ఓ బాబు కూడా జన్మించాడు. అయినప్పటికీ ఈ బ్యూటీ కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేస్తోంది.
Also Read : జనసేనాని పవన్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన అల్లు అర్జున్
కెరీర్ పరంగా సత్తా చాటుతోన్నప్పుడే స్రవంతి బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్లోకి కంటెస్టెంట్‌గా వెళ్లింది. అందులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మధ్యలోనే ఎలిమినేట్ అయింది.
యాంకర్ స్రవంతికి అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఇలా ఈ ముద్దుగుమ్మ ఇటీవలి కాలంలో ఎన్నో సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు, సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, చేసింది.
ఎంతో కాలంగా సినిమాలు, ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, టీవీ షోలు వంటివి చేస్తూ తనదైన రీతిలో సత్తా చాటుతోన్న యాంకర్ స్రవంతి చోకారపు.. సోషల్ మీడియా(Social Media) లో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది.
సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ సెన్సేషన్‌గా మారుతోంది. ఈ మధ్య కాలంలో అయితే హద్దు దాటేసి మరీ అందాలను ఆరబోస్తోంది.