NTR: ఢిల్లీలో వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారా? రారా? అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ
నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రూ.100 నాణాన్ని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్ జయంతి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం రూ.100 ముఖ విలువ కలిగిన ప్రత్యేక నాణేన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ ఈవెంట్కు నటుడు బాలకృష్ణ హాజరవుతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.