Star Heroine : టాలీవుడ్(Tollywood) లో చేసింది కొన్ని సినిమాలే అయినా వాటితో ఒకప్పుడు స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకుంది సోనాలి బింద్రే. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఇంద్ర, శంకర్ దాదా MBBS, మన్మథుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈమె చాలా సంవత్సరాల తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’(The Broken News) అనే సిరీస్ తో మళ్ళీ వెండితెరపై కనిపించింది.
ఇప్పుడు అదే సిరీస్ కి కొనసాగింపుగా ‘ది బ్రోకెన్ న్యూస్ 2’ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి బింద్రే(Sonali Bendre) నిర్మాతలపై సెన్షేషనల్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీ లో రూమర్స్ క్రియేట్ చేసేది, బాడీ షేమింగ్ చేసేది నిర్మాతలే అని పలు సంచలన విషయాలు బయటపెట్టింది.
Also Read : త్రిష గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు!
రూమర్స్ క్రియేట్ చేసేది నిర్మాతలే
తాజా ఇంటర్వ్యూలో సోనాలి బింద్రే మాట్లాడుతూ..” నేను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉండేవి. నా తోటి హీరోలకు నాకు మధ్య నిర్మాతలే రూమర్స్ క్రియేట్ చేసేవాళ్ళు. అందులో నిజం లేకపోయినా తమ సినిమాకి ప్రమోషన్ అవుతుందని అలా చేసేవాళ్ళు. నిజం చెప్పాలంటే ఇప్పటికీ ఈ చెత్త ట్రెండ్ ఇండస్ట్రీలో నడుస్తోంది. రూమర్స్ ని మీడియాకు లీక్ చేసేది కూడా నిర్మాతలే. అప్పట్లో ఈ విషయం తెలిసి నేను షాకయ్యా” అని చెప్పింది.
బాడీ షేమింగ్ కూడా చేశారు
సోనాలి బింద్రే ఇదే ఇంటర్వ్యూ లో కొందరు నిర్మాతలు తనను బాడీ షేమింగ్(Body Shaming) కూడా చేసినట్లు చెప్పింది. ” నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా సన్నగా ఉండేదాన్ని. దాంతో కొందరు నిర్మాతలు నన్ను బాడీ షేమింగ్ చేసేవాళ్లు. నాపై జోక్స్ కూడా వేసుకునేవాళ్ళు. నిజానికి అప్పట్లో హీరోయిన్స్ కొద్దిగా లావుగా ఉండేవాళ్ళు. నన్ను కూడా ఆలా అవ్వమని చెప్పేవాళ్ళు. కానీ నేనెప్పుడూ వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. నేనుఎలా ఉన్నానో అభిమానులు నన్ను అలాగే ఆదరించారు” అంటూ చెప్పుకొచ్చింది.