USA:అమెరికాను శీతాకాల పెను తుఫాను భయపెడుతోంది. మిడ్ వెస్ట్, దక్షిణ ప్రాంతాల్లో…తూర్పు భాగంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చలిగాలుల వలన 150 మంది మిలియన్ల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లేక్ సుపీరియర్, లే్ మిషిగాన్, లేక్ హురాన్, లేక్ ఎరియే, లేక ఒటారియో ప్రాంతాల్లో దాదాపు 2,50,000 ఇళ్ళల్లో కరెంట్ లేదు. ఇల్లినాయస్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మంచు తుఫాను వల్ల అర అడుగు మేర మంచు పేరుకుపోయింది. జనాలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు. రవాణా సౌకర్యాలు కూడా తగ్గిపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు.
Also Read:పీవోకేలో బ్రిటిష్ రాయబారి పర్యటన..తీవ్ర అభ్యంతరం
A brutal arctic blast will move into the US over the next several days with wind chills as cold as -60°F in North Dakota and Montana with temperatures up to 70 degrees below normal.
Negative wind chills could reach as far south as central Texas and the Deep South 🥶 pic.twitter.com/awcK5QR9RB
— Colin McCarthy (@US_Stormwatch) January 12, 2024
ఇక ఈ మంచు తుఫాను వలన విమానాలుకూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. రెండు వేల నాలుగు వందల విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరో రెండు వేల విమానాలు రద్దు అయ్యాయి. దీంతో విమానాశ్రాయాల్లో జనాలు పడిగాపులు కాస్తున్నారు. షికాగో ఎయిర్ పోర్ట్ ఓ-హారే లో 40శాతం విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ను రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. 36 శాతం విమానాలు ఎయిర్‌పోర్టుకు రావాల్సి ఉండగా.. ఇక చికాగో మిడ్వేస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడికి రావాల్సిన 60 శాతం విమానాలు రద్దు అయ్యాయి. డెన్వర్ ఎయిర్‌పోర్టు, మిల్వాకీ మిచెల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులతో పాటు.. పలు విమానాశ్రయాల్లో పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు అయినట్లు ఆయా ఎయిర్‌పోర్టుల అధికారులు తెలిపారు. ఇక ‘737 మ్యాక్స్ 9 విమానాల’ ల్యాండింగ్‌లో ఇబ్బంది ఉండటంతో.. పెద్ద సంఖ్యలో విమానాలు క్యాన్సిల్ కావడానికి కారణమంటున్నారు.
తూర్పు, మిడ్ వెస్ట్‌లో పరిస్థితి ఇలా ఉండగా అమెరికా దక్షిణ ప్రాంతంలో టోర్నడోలు విజృంభిస్తాయని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.