Thailand: ఒక్కోసారి మం బాగా చేసేదే బెడిసి కొడుతుంది. ఎన్నోసార్లు చేసినా కూడా దురదృష్టం వెంటాడుతుంది. ఇప్పుడు జరిగింది కూడా అలాంటి సంఘటనే. బ్రిటన్‌కు చెందిన నాథీ ఓడిన్సన్ ఒక స్కై ఫోటోగ్రాపర్. సాహసాలు చేయడం ఇతని హాబీ. చాలాసార్లు ఇలాంటి సాహసాలు చేశాడు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో బోలెడు వీడియోలుకూడా షేర్ చేశాడు. ఇప్పుడు కూడా అదే సాహసం చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు. నాథీ వయస్సు 33 ఏళ్ళు. ఇతను స్కై డైవింగ్ టీచర్ కూడా. అలాంటి సాహసాలుచేయాలనుకునేవారకి హెల్ప్ చేస్తుంటాడు కూడా. స్కై డైవింగ్‌లో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది.
Also read:Chandrababu: ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట
బాగా వచ్చిన విద్యే మృత్యు ఒడిలోకి నెట్టింది…
నాథీ ఓడిన్సన్ పాలిట బాగా వచ్చిన స్కై డైవింగ్ శాం అయింది. ఓ సోషల్ మీడియా కోసం 29 అంతస్తుల బిల్డంఇగ్ నుంచి స్కై డైవింగ్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. 29వ అంతస్తు టెర్రస్ మీద నుంచి దూకిన తర్వాత పారాచూట్ తెలురుకోలేదు. దీంతో నాథీ మొదట చెట్టును బలంగా ఢీకొట్టాడు తర్వాత నేల మీద పడి దుర్మరణం పాలయ్యాడు. థాయ్ లాండ్లో ఈ ప్రమాదం జరిగింది. శనివారం పట్టాయాకు వచ్చిన నాథీ స్కై డైవింగ్ కోసం అనుమతి తీసుకోలేదు. తరువాత కింద నుంచి అతని స్నేహితుడు వీడియో తీస్తుండగా సాహసానికి పూనుకున్నాడు. నేల మీద పడగానే నాథీ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు.
బ్రిటీష్ ఎంబసీకి సమాచారం…
నాథీ మరణం గురించి థామ్ లాండ్ పోలీసులు విచారణ చేపట్టారు. పారెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. దాంతో పాటూ బాంకాక్‌లోని బ్రటిన్ ఎంబసీకి సమాచారం అందించారు. నాథీ కుటుంబ సభ్యలను సంప్రదించేందుకు ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.