Manoj: బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ భాజ్ పాయ్ (Manoj Bajpayee) .. సోషల్ మీడియాలో వైలర్ అవుతున్న తన బోల్డ్ ఫొటో చర్చపై క్లారిటీ ఇచ్చారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man) వెబ్ సిరీస్ తర్వాత వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్న ఆయన.. ‘కిల్లర్ సూప్’(Killer Soup) అనే సిరీస్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రమోషన్స్ లో భాగంగా మనోజ్ సిక్స్ ప్యాక్ బాడీ చూపించే ‘ఇది కిల్లర్ లుక్’ అని క్యాప్షన్ పెట్టిన ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం చర్చనీయాంశమైంది.
Hum judwa hain toh entertainment bhi dugna hoga 🔥
Killer Soup is now streaming only on Netflix! (https://t.co/5lr0c8msrU)#KillerSoup #KillerSoupOnNetflix @NetflixIndia pic.twitter.com/JhAV5cvk8N
— manoj bajpayee (@BajpayeeManoj) January 12, 2024
అందుకే ఇలా చేశాం..
ఈ క్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడిన మనోజ్ భాజ్ పాయ్.. షర్ట్ లేకుండా ఉన్న ఫొటో తనది కాదని చెప్పారు. ‘అప్ కమింగ్ వెబ్ సిరీస్ ‘కిల్లర్ సూప్’ ప్రమోషన్స్ లో భాగంగా ఆ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే టైటిల్ కు తగ్గట్లుగా ‘కిల్లర్ సూప్’లాంటి ఫొటో పోస్ట్ చేసి.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టాలని నెట్‌ఫ్లిక్స్ సూచించింది. అందుకే ఇలా చేశాం. కానీ అది నిజమైన ఫొటో కాదు. ఒక యువకుడి శరీరానికి నా ముఖాన్ని అతికించారు. నేను సిక్స్‌ప్యాక్ చేయడమనేది అసాధ్యం. ఒకవేళ నేను చేయాలని కోరుకున్నా.. నా సినిమాలకు అది సరిపోదు. నేను విభిన్న పాత్రల్లో నటిస్తాను. అన్నిటికీ సిక్స్ ప్యాక్ పనికిరాదు. అందుకే నేను ఇలాంటి సాహసాలు చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించను’ అంటూ స్పష్టం చేశారు.
there needs to be a best prop in a series award to be given to this scene from killer soup. legit paused the show for 2 mins and laughed at this: pic.twitter.com/ZvxyWRKWme
— Hindol Hazra (@hindolheroic) January 18, 2024
ఫిబ్రవరి లాస్ట్ వీక్..
‘ది ఫ్యామిలీ మ్యాన్’కు సీక్వెల్ గా రాబోతున్న మూడో సీజన్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తూనేవుంది.