AP Assembly Speaker : ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Tammineni Sitaram) రాత్రి స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆయన విశాఖ మెడికవర్ ఆసుపత్రి(Visakha Medicover Hospital) లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. గురువారం ఆమదాలవలస నియోజకవర్గంలో పించన్ల పంపిణీ కార్యక్రమం అనతరం ఆయన స్వల్పంగా అస్వస్థతకు గురవ్వడంతో శ్రీకాకుళంలో మెడికవర్ వైద్యులు పరీక్షించి హెవీ డీ హైడ్రేషన్ కి గురవ్వడం వల్ల ఆయన అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు.
అసత్య ప్రచారాలు చేస్తున్నారు..
ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన మరిన్ని వైద్య పరీక్షల కోసం విశాఖ(Vizag) లోని మెడికవర్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ప్రస్తుతం జ్వరం ఎక్కువగా ఉందని ఆయన ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్స్ తెలిపారు. ఈ క్రమంలోనే ఆసుపత్రి నుంచి తమ్మినేని సీతారం మాట్లాడారు. తనకు వ్యాధి వచ్చిందని కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ క్రమంలో ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ” నాయకులకు, కార్యకర్తలకు నా ముఖ్యమైన విజ్ఙప్తి. త్వరలోనే నేను ప్రజాహిత కార్యక్రమాలకు వస్తాను. ప్రజల సంక్షేమం కోసం నేను కచ్చితంగా పర్యటిస్తాను. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేస్తా. ఇది నా బాధ్యత. ఎవరు ఎన్ని అనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
నాకు ఏదో పెద్ద జబ్బు వచ్చింది, వ్యాధి వచ్చిందని ప్రచారం చేయడం సరికాదు. సోమవారం నుంచి ప్రభుత్వ కార్యక్రమాలకు యథావిధిగా హాజరవుతా” అని తమ్మినేని వీడియోలో తెలిపారు.
Also read: ఏపీ విద్యార్థులకు శుభవార్త.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన జగన్ సర్కార్.. తేదీలివే!