Shruti Haasan Break-Up : శృతి హాసన్(Shruti Hassan) ప్రస్తుతం సినీ కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. గత ఏడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘సలార్’ వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇదిలా ఉంటే శృతి హాసన్ గత కొంత కాలంగా ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్(Doodle Artist) శాంతను హజారికా(Shantanu Hazarika) తో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా(Social Media) లో ఈ ఇద్దరూ ఎన్నోసార్లు తమ ప్రేమను బయటపెట్టారు. అయితే తాజాగా ఈ ఇద్దరికి బ్రేకప్ అయినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
అందుకు ప్రధాన కారణం శృతి హాసన్ తన ప్రియుడ్ని అన్ ఫాలో చేయడమే. అటు శాంతను సైతం శృతి హాసన్ ని ఫాలో అవ్వకపోవడం గమనార్హం. వీళ్ళ బ్రేకప్ కి వ్యక్తిగత కారణాల వల్లే ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారట. అంతేకాదు ఈ ఇద్దరూ తమ పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శృతి హాసన్ తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టింది.” ఇదో ఒక క్రేజీ ప్రయాణం. ఈ ప్రయాణంలో నా గురించి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నా. అలాగే ఇతరుల గురించి కూడా అర్థం చేసుకున్నా” అని తన పోస్ట్ లో పేర్కొంది. దీంతో శృతి హాసన్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
కాగా శాంతను అంటే తనకు చాలా ఇష్టమని శృతి హాసన్ గతంలో ఎన్నో సార్లు చెప్పింది. ముఖ్యంగా అతని అభిరుచికి ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పింది. అలంటి ఈ హీరోయిన్ ఇప్పుడు ప్రియుడితో బ్రేకప్ చేసుకోవడంతో నెట్టింట దీని గురించే డిస్కషన్ నడుస్తోంది. మరి ఎంతో కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట ఎందుకు విడిపోయారో తెలియాలంటే స్వయంగా శృతి హాసనే తన బ్రేకప్ పై స్పందించాలి. ఇక ప్రస్తుతం శృతి హాసన్ అడివి శేష్ తో కలిసి ‘డకాయిట్’ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే గత ఏడాది విడుదలైన ‘సలార్’ కి కొనసాగింపుగా తెరకెక్కనున్న ‘సలార్ పార్ట్-2’ లో నటిస్తోంది. రీసెంట్ గా రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ మూవీలోనూ కీలక పాత్ర కోసం శృతి హాసన్ ని తీసుకున్నట్లు సమాచారం.