Shilpa Shetty and Raj Kundra: ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పెట్టిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ‘మేము విడిపోయాం.. ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంచెం సమయం కావాలంటూ’ ట్విట్టర్లో పోస్ట్ చేసారు రాజ్ కుంద్రా. గుండె పగిలిన ఇమోజీతోపాటు నమస్కరిస్తున్న గుర్తును కూడా యాడ్ చేసారు. అర్ధరాత్రి వేళ ఆయన పెట్టిన పోస్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి జంటలు ఎక్కువ అయ్యారు.
టాలీవుడ్ లో సమంత, నాగచైతన్య విడాకులు, నిహారిక జొన్నలగడ్డ చైతన్య విడాకులు ఎంత సెన్సేషన్ సృష్టించాయో తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కొన్ని మనస్పర్దలతోనే విడాకులు తీసుకున్నారు. ఇక కోలీవుడ్ లో ధనుష్, ఐశ్వర్య విడాకులు కూడా అంతే సెన్సేషన్ సృష్టించాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో ఓ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా రాజ్ కుంద్రా ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ అందరీని షాక్‌కి గురి చేసింది. ‘మేము విడిపోయాం.. ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంచెం సమయం కావాలంటూ’ ట్విట్టర్లో పోస్ట్ చేసారు రాజ్ కుంద్రా. గుండె పగిలిన ఇమోజీతోపాటు నమస్కరిస్తున్న గుర్తును కూడా యాడ్ చేసారు. అర్ధరాత్రి వేళ ఆయన పెట్టిన పోస్ట్ అందరీని ఆశ్చర్యానికి గురి చేసింది.
We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔
— Raj Kundra (@onlyrajkundra) October 19, 2023
రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి 2009 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి వియాన్, సమీషా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, 2021లో బ్లూ ఫిలిమ్స్ కేసులో రాజ్ కుంద్రా అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఇక కొంత కాలంపాటు జైలు జీవితం కూడా గడిపాడు రాజ్ కుంద్రా. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీడియాకు తన ముఖం చూపేందుకు కూడా ఇష్టపడలేదు ఆయన. బయటకు వస్తే మాత్రం మాస్క్ తో వచ్చి కనబడే వారు. అలాంటి సమయంలో కూడా వదలని శిల్పా శెట్టి ఇప్పుడు సడెన్ గా ఎందుకు వదులుకుంటుంది అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: అబ్బాయిలూ…ఇలాంటి గుణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఉండరు..!!