Satwik-Chirag: పారిస్ ఒలింపిక్స్‌లో భారత ప్లేయర్లు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్-చిరాగ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. దీంతో ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ చేరిన తొలి భారత డబుల్స్ జోడీగా రికార్డు సృష్టించారు.
Sports bring Joy to people of all age groups. Unfortunately we dont have strong sports loving culture,Dreaming for a day our Indians also enjoy and support like this 🙌🏻 pic.twitter.com/R0JZ48xGao
— Team Satwik (@team_satwik) July 29, 2024
ఈ మేరకు పారిస్ ఒలింపిక్స్ జర్మనీ జోడీ మార్క్-మెర్విన్‌తో సోమవారం జరగాల్సిన మ్యాచ్ క్యాన్సిల్ అయింది. మార్క్‌కు మోకాలి గాయం కావడంతో అతడు టోర్నీ నుంచి వైదొలిగాడంతో మ్యాచ్ రద్దు చేశారు. గ్రూప్ సిలో ఆర్డియాంటో- ఆల్పియన్ (ఇండోనేషియా) చేతిలో 21-13, 13-10 తేడాతో ఫ్రెంచ్ జోడీ లాబార్-కోర్వీ పరాజయం పాలవ్వడంతో సాత్విక్-చిరాగ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.