Sania Mirza Reacts On Divorce : పాకిస్థాన్(Pakistan) మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్(Shoaib Malik) తన వివాహ ఫొటోలను సోషల్ మీడియా(Social Media) లో షేర్ చేయడంతో సానియా మీర్జా(Sania Mirza) వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్(Trending Topic) గా మారింది. సనా జావేద్‌తో తన వివాహానికి సంబంధించిన ఫొటోను మాలిక్ షేర్ చేయడంతో షోయబ్‌తో సానియా విడాకుల పుకార్లు నిజమయ్యాయి. ఇప్పుడు ఈ విషయంపై సానియా కుటుంబం మౌనం వీడింది.
‘సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల దృష్టికి దూరంగా ఉంచింది. అయితే, షోయబ్ – ఆమె విడాకులు తీసుకుని కొన్ని నెలలవుతున్న విషయాన్ని పంచుకోవాల్సిన అవసరం ఈ రోజు తలెత్తింది. షోయబ్ కొత్త ప్రయాణానికి సానియా శుభాకాంక్షలు చెబుతోంది.. ఆమె జీవితంలోని ఈ సున్నితమైన సమయంలో.. అభిమానులు, శ్రేయోభిలాషులందరూ ఎలాంటి ఊహాగానాలకు పాల్పడకుండా ఉండవలసిందిగా, ఆమె గోప్యత అవసరాన్ని గౌరవించాలని మేము కోరుతున్నాము…’ అని సానియా టీమ్ షోయబ్-మిర్జా విడాకుల విషయాన్ని కన్ఫర్మ్ చేసింది.
‘ఖులా’ ఏకపక్ష విడాకులు..
ఈ మేరకు సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా మాట్లాడుతూ.. ‘సానియా మీర్జా ‘ఖులా’ను ఎంచుకుంది. ఇది ఒక ముస్లిం మహిళ తన భర్తకు ఏకపక్షంగా విడాకులు ఇచ్చే హక్కును సూచిస్తుంది. నా కూతురు ప్రస్తుతం ఏకపక్షంగా విడాకులు తీసుకుంది’ అన్నారు. అయితే విడాకులకు మాలిక్ అంగీకరించారా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడం విశేషం.
ఎవరి సనా?
క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్(Sana Javed) తో మూడో పెళ్లి చేసుకున్నాడు. షోయబ్-సానియా మీర్జా విడిపోయిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ జంట, జనవరి 20న తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. సనా జావేద్ ఉర్దూ టెలివిజన్‌లో కనిపించే పాకిస్థానీ నటి. ఆమె 2012లో ‘షెహర్-ఎ-జాత్’తో అరంగేట్రం చేసింది. తరువాత అనేక సీరియల్స్‌లో కనిపించింది. రొమాంటిక్ డ్రామా ‘ఖానీ’లో టైటిల్ రోల్‌తో ఆమెకు గుర్తింపు దక్కింది. అక్టోబర్ 2020లో, ఆమె కరాచీ(Karachi) లోని తన నివాసంలో జరిగిన నికాహ్ వేడుకలో గాయకుడు ఉమైర్ జస్వాల్‌ను పెళ్లి చేసుకున్నారు. వారి వివాహం అప్పట్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది. పాక్‌లో అత్యంత ఆరాధించే ప్రముఖ జంటలలో వీరు ఒకరిగా మారారు.
Also Read: షోయబ్ మాలిక్‌ని పెళ్లాడిన సనా ఎవరు?
WATCH: