ప్రేమకు ఎల్లలు లేవు. దేశాల పరిమితులను దాటి ప్రేమించుకుంటుంటారు. ఒకరి కోసం ఒకరు అననీ వదులుకుని వచ్చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఈ మధ్య కాలంలో చాలనే చూశాము. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ప్రేమించ యువతి కోసం నాలుగేళ్ళు వెయిట్ చేసి అబ్బాయి…ప్రేమించిన అబ్బాయి కోసం దేశాన్నే దాటి సరిహద్దులను చెరిపేసిన అమ్మాయి. ఇది ఎలా జరిగింది అంటే…
కోల్‌కతాకు చెందిన సమీర్‌ఖాన్ జర్మనీలో చదువుకున్నాడు. అప్పుడు ఒకసారి భారత్‌కు వచ్చినప్పుడు తన తల్లి ఫోనులో కరాచీకి చెందిన జావెరియా ఖానుమ్ ఫొటో చూసి మనసు పారేసుకున్నాడు. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటా అంటూ పట్టుబట్టి కూర్చున్నాడు. ఆ అమ్మాయిని కూడా ఒప్పించాడు. ఇద్దరూ కలిసి పెద్దలు సైతం అంగీకరించేలా చేసుకున్నారు. కానీ విధి వాళ్ళ ప్రేమకు, పెళ్ళికి అడ్డంకిగా మారింది. కాలం అస్సలు కలిసి రాలేదు. సమీర్ కోసం భారత్‌కు వచ్చేందుకు రెండుసార్లు జావెరియా ప్రయత్నించగా ఆమె వీసా తిరస్కరణకు గురైంది. మధ్యలో కొవిడ్ కష్టాలు వచ్చిపడ్డాయి. అలా ఐదేళ్ళు గడిచిపోయాయి.
మళ్ళీ ఇన్నాళ్ళకు జవేరియాకు అవకాశం వచ్చింది. తనకోసం వెయిట్ చేస్తున్న సమీర్ ఖాన్ దగ్గరకు రాగలిగింది. 45 రోజుల గడువుతో జావెరియాకు ఎట్టకేలకు భారత్ వీసా దక్కింది. అమృత్సర్ నుంచి కోల్‌కతాకు సమీర్ ఖాన్, జవేరియా వచ్చారు. జావెరియాకు వీసా మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి సమీర్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపాడు. జవేరియాకు సమీర్ ఖాన్ ఙంట్లో వారు ఘనంగా స్వాగతం పలికారు. వీరిద్దరికీ జనవరిలో పెళ్ళి జరగనుంది.
#WATCH | Amritsar, Punjab: A Pakistani woman, Javeria Khanum arrived in India (at the Attari-Wagah border) to marry her fiancé Sameer Khan, a Kolkata resident. She was welcomed in India to the beats of ‘dhol’.
She says, “I am extremely happy…I want to convey my special thanks… pic.twitter.com/E0U00TIYMX
— ANI (@ANI) December 5, 2023