Sam Alton:ఏఐ చాట్‌బాట్ చాట్ జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్టన్. ఈమధ్య కాలంలో ఇతని పేరు మారుమోగిపోయింది. దాంతో పాటూ లాస్ట్ ఇయర్ వామ్ ఆల్టన్ను ఏఐ సీఈవోగా తొలగించడం..మైక్రోసాఫ్ట్ అతన్ని హైర్ చేసుకోవడం.. కానీ మళ్ళీ ఏఐ సంస్థే అతన్ని వెనక్కి తీసుకోవడంతో ఇలా ఓ పెద్ద కథే జరిగింది. దీంతో కొన్ని రోజుల పాటూ శామ్ ఆల్టన్ వార్తల్లో నిలిచాడు. ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు ఒక సెటిల్మెంట్కు వచ్చిన శామ్ పెళ్ళివైపు అడుగులు వేవాడు. తన చిరకాల బాయ్ ఫ్రెండ్ ఆస్ట్రేలియాకు చెందిన మల్హెరిన్‌ను పెళ్ళి చేసుకున్నాడు. అమెరికాలోని హవాయ్ సముద్రతీరంలో వీరి పెళ్ళి సింపుల్‌గా జరిగిపోయింది.
Also read:కుమారుడి మృతదేహం దగ్గర లేఖ రాసిన పెట్టిన సీఈవో
OpenAI CEO Sam Altman got married. pic.twitter.com/9I0D1mtwuV
— News Arena India (@NewsArenaIndia) January 11, 2024
శామ్ ఆల్టన్ స్కూల్లో చదువుతున్నప్పుడే తాను గేనని చెప్పుకున్నాడు. పెద్దయ్యాక తొమ్మిదేళ్ల పాటు లూప్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్ సివోతో డేటింగ్ చేసి 2012లో విడిపోయారు. తరువాత మల్హెరిన్‌తో స్నేహం మొదలుపెట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఇతను మెల్ బోర్న్ యూనివర్శిటీలో చదువుకున్నాడు. 2020 నుంచి 2022 వరకు మెటాలో పనిచేశారు. ఆల్ట్‌మన్, మల్హెరిన్ .. తమ బంధం గురించి ఎప్పుడూ బయటపెట్టలేదు. 2023 సెప్టెంబర్‌లో మొదటిసారి ఓ న్యూస్ పేపర్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు శామ్ ఆల్టన్. మల్హెరిన్, తాను ఇద్దరమూ శాన్ఫ్రాన్సిస్కోలోని ఒకే ఇంట్లో ఉంటున్నామని ఆల్ట్‌మన్ తొలిసారి న్యూయార్క్ మ్యాగజైన్ తో చెప్పారు. గత ఏడాది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విందుకు ఆల్ట్‌మన్ మొదటిసారి మల్హెరిన్‌తో కలిసి వచ్చారు.
Also Read:పండక్కి ఊరు వెళుతున్న సిటీ..జనాలతో నిండిపోయిన రోడ్లు