Chain Snatching in Train: ఇటీవల కాలంలో ఈజీ మనీ కోసం చాలామంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రోడ్డు మీద వాకింగ్ చేస్తున్నట్లు నటించి ఒంటరి మహిళలే టార్గెట్ గా దోపిడీలకు పాల్పడుతున్నారు. బైక్పై వచ్చి బంగారు గొలుసులు దొచుకెళ్తున్నారు. అయితే ఓ దొంగ తన ప్రాణాలకు తెగించి మరీ మహిళ మెడలో చైన్ కొట్టేసిన సంఘటన సంచలనం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా వివరాలు ఇలా ఉన్నాయి.
*While traveling in a train be careful* pic.twitter.com/6EDtRiEhXS
— Narayanan R (@rnsaai) March 26, 2024
టాయిలెట్ రూమ్ దగ్గర నిలబడి..
ఈ మేరకు ఓ యువకుడు రైలు బోగీ కంపార్ట్మెంట్ గేట్ దగ్గర నిలబడి ఉన్నాడు. టాయిలెట్ రూమ్స్ దగ్గరకి ఇద్దరు మహిళలు వచ్చారు. దొంగ వారిలో ఒకరి మెడలో బంగారపు గొలుసు చూశాడు. ఆమె టాయిలెట్స్ నుంచి బయటకు రాగానే మెడలోనుంచి బంగారు గొలుసు తెంపుకుని రన్నింగ్ ట్రైన్ నుంచి ఒక్కసారిగా కింద దూకేశాడు. రైలు బయట పట్టాలకు పక్కనే ఆ దొంగ పడిపోయాడు. ఈ దృశ్యం ట్రైన్ లో ఏసీ బోగీ డోర్ దగ్గర ఉన్న సీసీటీపీ కెమెరాలో రికార్డ్ అవగా.. ప్రస్తుతం ఈ చోరీ వీడియో వైరల్ అవుతుంది.
Also Read: Airtel, Jio కస్టమర్లకు షాక్.. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?