RK Roja, Dharmana Krishna Das: వైసీపీ ప్రభుత్వం హయాంలో రోజా, ధర్మాన కృష్ణ దాస్లు మంత్రులుగా పని చేశారు. అప్పటి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా అనే క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిని మాజీ మంత్రులు రోజా, ధర్మానలే దగ్గరుండి చూసుకున్నారు. అయితే ఈ మొత్తం కార్యక్రమంలో నిధులు దుర్వినియోగం అవడమే కాక..పక్కదారి కూడా పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్రా, సీఎం కప్ కార్యక్రమాల పేరుతో క్రీడలశాఖ మంత్రిగా పని చేసిన ఆర్కే రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది ఏపీ ఆత్యా–పాత్య సంఘం. దీని మీద సీఐడీ విచారణ కోరింది. ఈఫిర్యాదును పరిగణలోకి తీసుకుని..విచారణ జరపాలని ఎన్టీయార్ జిల్లా సీపీని సీఐడీ ఏడీజీ ఆదేశించింది. దీంతో రోజా, ధర్మాన చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్టు అయింది.