తెలుగు యంగ్ హీరోయిన్ రేఖా భోజ్ భారత క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా యువకులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా గెలిస్తే విశాఖపట్నం సముద్ర తీరాన బట్టల్లేకుండా తిరుగుతానని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు తానుచేస్తున్న పనిలో తప్పేమీ లేదని, క్రికెట్ మీద అభిమానంతోనే ఇలా చేస్తున్నట్లు తెలిపింది.
If India wins the World Cup,
I will streak on Visakhapatnam beach.
India World Cup కొడితే, వైజాగ్ బీచ్ లో streaking చేస్తా…— Rekha Boj (@rekha_boj) November 15, 2023
ఈ మేరకు తాను క్రికెట్ పెద్ద అభిమానురాలినని, ఈ గేమ్ ను ఒక ఎమోషన్ లా భావిస్తానని చెప్పింది. ‘భారత్ ప్రపంచకప్ గెలిస్తే.. నేను విశాఖపట్నం బీచ్‌లో నగ్నంగా (streaking) తిరుగుతాను’ అంటూ నెట్టింట షేర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున స్పందిస్తున్న ఆమె ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేయగా వెంటనే స్పందించిన నటి.. ‘క్రికెట్ అంటే ఎమోషన్.. కాబట్టి విప్పడంలో తప్పేం లేదు. నేను మనస్పూర్తిగా ఇండియన్ క్రికెట్ మీద అభిమానంతో ఈ పని చేస్తున్నా. హైప్ కోసం కాదు’ అంటూ తన పనిని సమర్థించుకుంటోంది. అలాగే ‘క్రికెట్ అంటే అన్ లిమిటెడ్ ఎమోషన్.. వరల్డ్ కప్ మూమెంట్‌కి నో లిమిట్స్’ అంటూ బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తోంది.
Also read :అతను పొట్టివాడే కానీ పొగరు ఎక్కువ.. ప్రియాంక గాంధీ సెటైర్లు
ఇక గతంలో కూడా పూనమ్ పాండేతోపాటు చాలామంది నటుడు, మోడల్స్ ఇలాంటి ప్రకటనలు చేసి ఫేమస్ అయ్యారు. దీంతో రేఖా భోజ్ కూడా వెలుగులోకి రావడానికి విప్పుడు కార్యక్రమానికి తెరలేపిందంటున్నారు నెటిజన్లు. అలాగే ‘నువ్వు మనస్పూర్తిగా బట్టలిప్పితే.. మేం మనస్పూర్తిగా చూడ్డానికి ఆరోజు వైజాగ్ వచ్చేస్తాం. ఇండియా కోసం కాకపోయినా నిన్ను అలా చూడ్డానికైనా అక్కడకి వస్తాం. మాట మార్చవు కదా’ అంటూ నటిని ఆడేసుకుంటున్నారు. నిజానికి ఇలాంటి కల్చర్ విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ ఇతర క్రీడల్లో తమ టీమ్ గెలిచినప్పుడు పట్టరాని ఆనందంలో కొంతమంది బట్టలిప్పి పరుగులు తీస్తుంటారు.