Tripti Dimri: బోల్డ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి తాను లవ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై స్పందించింది. అంతేకాదు తాను చేసుకోబోయేవాడి గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మేరకు ఇటీవల వచ్చిన ‘యానిమల్’ (Animal Movie) మూవీతో భారీ పాపులారిటీ పొందిన నటి వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. ఆ సినిమాలో తన నటనతో యువ హృదయాలను కొల్లగొట్టిన హాటీ.. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా చెప్పేసింది.
Can’t wait to introduce her to the world ❤️@CleanSlateFilms @NetflixIndia #anvitaadutt #karneshssharma @swastika24 pic.twitter.com/6fHHflVssd
— Triptii Dimri (@tripti_dimri23) November 12, 2022
అలాంటి వ్యక్తినే..
త్రిప్తి మాట్లాడుతూ.. ‘నా పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నా ఆలోచనలన్నీ కెరీర్ పైనే ఉన్నాయి. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. కానీ కాబోయే వాడికి ఆస్తి ఉన్నా.. లేకపోయినా మంచి మనసు ఉండాలని కోరుకుంటున్నా. అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా’ అని తెలిపింది. ఇక ఇక ‘యానిమల్’లో ‘జోయ’ పాత్రలో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గతంలో త్రిప్తికి 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 48 లక్షలకు చేరింది.
ఇది కూడా చదవండి : Beauty Secret: 59 ఏళ్ల వయస్సులోనూ పిచ్చేక్కిస్తోంది గురూ…ఈమె బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.?
మోస్ట్ పాపులర్ హీరోయిన్..
అంతేకాదు ఐఎండీబీ (ఇండియన్ మూవీ డేటాబేస్) ఇటీవల విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోయిన్ల (Most Popular Heroine) జాబితాలోనూ ఆమె ఫస్ట్ ప్లేస్ దక్కించుకోవడం విశేషం. కాగా ఆమెకు బాలీవుడ్, టాలీవుడ్‌లలో వరుస అవకాశాలు వస్తున్నాయనే వార్తలు కూడా వైరలవుతున్నాయి. కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) హీరోగా అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న ‘ఆషికీ 3’లో అవకాశం వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)- గౌతమ్ తిన్ననూరిల స్పై థ్రిల్లర్‌లోను ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ (Ravi Teja) హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలోనూ త్రిప్తిని (Tripti Dimri) ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది.