ఇటీవలే రష్మిక డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలన రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఇష్యూపై పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతుండగానే మరో డీప్ ఫేక్ ఫొటో బయటకొచ్చింది. సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కు సంబంధించిన ఓ ఫేక్ ట్విట్టర్ అకౌంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఇండియా క్రికెటర్ శుభ్ మాన్ గిల్‌కు సారా విషెస్ చెబుతున్నట్లు చూపించే ట్విట్టర్ అకౌంట్ నుంచి కొన్ని పోస్టులు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంట్లో బ్లూ టిక్ మార్క్ ఉండటంతో ఇది సారా నిజమైన అకౌంట్ గా భావించిన నెటిజన్లు రచ్చ మొదలుపెట్టారు.
Sara Tendulkar takes to her Instagram story to address the presence of a fake Twitter account circulating under her name across the internet. pic.twitter.com/wLnOKbRAkk
— CricTracker (@Cricketracker) November 22, 2023
Also read : 60 బీర్లు ఒకేసారి తాగిన యువకుడు..ఆ రిజల్ట్ చూసి ఆశ్చర్యపోయాయిన డాక్టర్లు
అయితే ఈ విషయం తెలియగానే స్పందించిన సారా.. తన పేరిట నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. నిజానికి తనకు ఎక్స్ (ట్విట్టర్)లో అకౌంటే లేదంటూ ఇన్‌స్టా వేదికగా ఓ నోట్ షేర్ చేసింది. 'మన బాధలు, సంతోషాలు అలాగే రోజువారీ కార్యక్రమాలను పంచుకునేందుకు సోషల్ మీడియా ఓ అద్భుతమైన వేదిక. అయితే కొంతమంది ఈ సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. వాస్తవాలను దాచిపెడుతూ అసత్యాలతో ఇంటర్నెట్‌ను నింపేస్తున్నారు. నా డీప్ ఫేక్ ఫొటోలు కూడా నా దృష్టికి వచ్చాయి. ఎక్స్ లో నాపేరుతో నకిలీ అకౌంట్స్ ఓపెన్ చేసి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజానికి నాకు ఎక్స్‌లో అకౌంటే లేదు. నా పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్లను ఎక్స్ వీలైనంత త్వరగా గుర్తించి తొలగిస్తుందని ఆశిస్తున్నా. వాస్తవాలను పంచుకోవడానికే సోషల్ మీడియాను ఉపయోగిద్దాం. నిజాలనే ఎంకరేజ్ చేద్దాం. వెంటనే నా పేరిట ఉన్న నకిలీ అకౌంట్ల మీద చర్యలు తీసుకోవాలని ఎక్స్ మెనేజ్ మెంట్ ను కోరుతున్నా' అంటూ ఇందులో రాసుకొచ్చింది సారా. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుండగా గతంలోనూ సచిన్ తన కూతురుకు ట్విట్టర్ అకౌంట్ లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.