Ravi Shankar: నటుడు రవిశంకర్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, డైరెక్టర్, రైటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అరుంధతి సినిమాలో రవిశంకర్ పశుపతి క్యారెక్టర్ కు ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకు ఓ హైలెట్ అనే చెప్పాలి. ‘అమ్మా బొమ్మాలి’ అంటూ ఆయన చెప్పిన వాయిస్ మాడ్యులేషన్ ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంటుంది. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఓ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
#ఎస్ జీ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2
‘ఎస్ జీ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో రవిశంకర్ మేల్ లీడ్ గా నటిస్తున్నారు. ఎస్జీ మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రేపు ఉదయం 10:45 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. ఈ చిత్రంలో అద్వయ్, రుబాల్ షెకావత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పాపులర్ సింగర్ రవిబస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ‘మిస్టరీ వీడబోతుంది’… అంటూ రిలీజ్ చేసిన అప్డేట్ పోస్టర్ సినిమా పై క్యూరియాసిటీ పెంచుతోంది.
“Let the mystery unveil” 🤘💥
Stay tuned for the FIRST LOOK of @sg_movies_‘ Production No 2, RELEASING TOMORROW (Aug 31) at 10:45 AM 🤯🤯@Ravishankar_66 @advayinaction#RubalShekawat #RaviBasrur@vijayMKumar12 @ursanilkadiyala @urspravina @urstirumalreddy @SprintFilms… pic.twitter.com/POtLn86Is5
— BA Raju’s Team (@baraju_SuperHit) August 30, 2024
Also Read: Indian 2 Movie: ‘ఇండియన్ 2’ నిర్మాతలకు లీగల్ నోటీసులు.. ఓటీటీ నిబంధనల ఉల్లంఘన – Rtvlive.com