Ranveer-Deepika : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో రణ్వీర్ సింగ్(Ranbir Singh), దీపికా పదుకొణె(Deepika Padukone) దంపతులకు సంబంధించి మరోవార్త వైరల్ అవుతోంది. కొంతకాలంపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీ మ్యారేజ్ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అంతేకాదు బోల్డ్ షోతోనూ ప్రేక్షకులను అలరిస్తూ తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇదిలావుంటే.. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.
View this post on Instagram
Also Read : రేపే చిరంజీవికి పద్మవిభూషణ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న మెగాస్టార్!
పెళ్లి ఫొటోలు డిలిట్..
ఈ మేరకు రణ్ వీర్ ఇన్స్టాగ్రామ్(Instagram) లో పెళ్లిఫొటోలు డిలిట్ చేసినట్లు ఆయన ఫాలోవర్స్ స్క్రీన్ షాట్లు బయటపెట్టడంతో చర్చ ఊపందుకుంది. ఆయన పోస్ట్ చేసిన ఫొటోలన్నీ కనిపిస్తున్నాయని, కేవలం దీపికతో దిగిన మ్యారేజ్ పిక్స్(Marriage Pics) తొలగించాడంటూ రకరకాల పుకార్లు మొదలుపెట్టారు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయా? నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారా? లేదా వార్తల్లో నిలిచేందుకు మరేదైనా స్టంట్ చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీపిక ప్రస్తుతం గర్భంతో ఉన్న సంగతి తెలిసిందే. కాగా డివోర్స్ వార్తలపై ఎవరు ముందుంగా స్పందిస్తారోనని ఫ్యాన్స్ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram