తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడయ్యాయి. కొన్ని సర్వేలు బీఆర్ఎస్, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని స్పష్టం చేశాయి. ఎన్నికల ప్రచారానికి మరో 8 రోజులు మాత్రమే మిగిలిఉన్న ఈ సమయంలో ప్రముఖ సీ-ఓటర్ సంస్థ తన ఒపీనియన్ పోల్ ను విడుదల చేసింది. మరో సారి తెలంగాణ గడ్డపై గులాబీ జెండా ఎరగడం ఖాయమని ఈ సర్వే తేల్చిచెప్పింది. తెలంగాణలోని మొత్తం 119 స్థానాల్లో బీఆర్ఎస్ 66, కాంగ్రెస్ 41, బీజేపీ 5, ఎంఐఎం 7 స్థానాలు గెలుచుకుంటాయని సీ ఓటర్ ఒపీనియన్ పోల్ అంచనావేసింది. జిల్లాల వారీగా ఒపీనియన్ పోల్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఉమ్మడి మెదక్ లో…
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో సిద్ధిపేటలో బీఆర్ఎస్ 47.1 శాతం ఓట్లతో లీడింగ్ లో ఉంటే, కాంగ్రెస్ పార్టీ కేవలం 29.9 శాతం ఓట్లకే పరిమితం అవుతుందని సీఓటర్ తెలిపింది. మెదక్ లో బీఆర్ఎస్ 42.9 శాతంతో లీడింగ్ ఉంటే కాంగ్రెస్ 37.6 శాతంతో తర్వాత స్థానంలో ఉంది. ఇక నారాయణ ఖేడ్ లోనూ కారుపార్టీ 43.9 శాతం ఓట్లు సాధిస్తే.. కాంగ్రెస్ 33.7 శాతానికి పరిమితం అవుతుందని సీ-ఓటర్ ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. అందోలు లో బీఆర్ఎస్ 54.2 శాతంతో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే కాంగ్రెస్ 36 శాతం ఓట్లతో రెండో స్థానానికికే పరిమితం అవుతుందని తేల్చిచెప్పింది. నర్సాపూర్ లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేయగా.. ఆ పార్టీకి 57.9 శాతం ఓట్లు, బీఆర్ఎస్ కు 33 శాతం ఓట్లు వస్తాయని ఈ ఒపీనియన్ పోల్ గణంకాలు తెలిపాయి. జహీరాబాద్ లో బీఆర్ఎస్ కు 42.3 శాతం, దుబ్బాకలో 40.3, గజ్వేల్ లో 45.5 శాతం ఓట్లతో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఒపీనియన్ పోల్ వెల్లడించింది.సంగారెడ్డిలో 47.2, పటాన్ చెరు లో 49.4 శాతం ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తుందని ఒపీనియన్ పోల్ వెల్లడించింది.
ఉమ్మడి కరీంనగర్..
జగిత్యాలలో 45.7 శాతం, ధర్మపురి 43.7, రామగుండం 42.4, కరీంనగర్ 36.13, చొప్పదండి 41.95, వేములవాడ 45.9, సిరిసిల్ల 47.9 శాతం ఓట్లతో బీఆర్ఎస్, మంథని లో 54.8, పెద్దపల్లిలో 45.7 శాతం ఓట్లతో కాంగ్రెస్ , కోరుట్లతో బీజెపీ 39.1 శాతం ఓట్లతో గెలుస్తాయని సీ-ఓటర్ ఒపినీయన్ పోల్ లెక్కలు చెబుతున్నాయి. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఈ ఒపీనియన్ పోల్ తెలిపింది. ఇంకా హుజూరాబాద్ 42 శాతం ఓట్లతో బీజేపీ.. మానకొండూరులో 37 శాతం హుస్నాబాద్ 44.2 ఓట్లతో బీఆర్ఎస్ మరో సారి కారు జోరే ఉంటుందని స్పష్టం చేసింది. హుజూరాబాద్ లో మరో సారి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ విజయం సాధిస్తారని తేల్చి చెప్పంది ఈ ఒపీనియన్ పోల్.
ఉమ్మడి హైదరాబాద్..
ఉమ్మడి హైదరాబాద్ లో సనత్ నగర్ లో బీఆర్ఎస్ 55.7 శాతం ఓట్లతో గెలుస్తుందని… నాంపల్లిలో 40.5 శాతంతో, కార్వాన్ లో 39.3 శాతంతో, చార్మినార్ లో 39 శాతంతో ఎంఐఎం గెలుస్తుందని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. అయితే గోషామహల్ లో మాత్రం బీజేపీదే హవా అని స్పష్టం చేసింది. మరో సారి రాజా సింగ్ కే అక్కడి ప్రజలు పట్టం కడతారని అంచనా వేసింది. అక్కడ బీజేపీ 46.1 శాతం ఓట్లతో గెలుపు ఖాయం అని వెల్లడించింది. ముషీరాబాద్ 43.2, అంబర్ పేట్ 43.6, ఖైరతాబాద్ 49.6, జూబ్లీహిల్స్ 42.6 , సికింద్రాబాద్ 34.6, కంటోన్మెంట్ (ఎస్సీ) 53.3 శాతం ఓట్లతో బీఆర్ఎస్… మలక్ పేటలో ఎంఐఎం 39.3 శాతం, చాంద్రాయణ గుట్ట 49.1, యాకుత్ పురా 41.1, బహదూర్పురా 53.9 శాతం ఓట్లతో ఎంఐఎం అభ్యర్థులు గెలవబోతున్నారని ఒపీనియన్ పోల్ స్పష్టం చేసింది.
ఉమ్మడి రంగారెడ్డి…
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మరో సారి కారు జోరే ఉంటుందని సర్వే స్పష్టం చేసింది. మేడ్చల్ 46.9, మల్కాజ్ గిరి 48.8, కుత్బుల్లాపూర్ 49.6 , కూకట్ పల్లి 49.6, ఉప్పల్ 46.5 , మహేశ్వరం 35.1 , రాజంద్రేనగర్ 44.8 , లింగంపల్లి 52.3, ఎల్బీనగర్ 59.23 శాతం ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ మరో సారి విజయం సాధిస్తుందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ 31.6, చేవెళ్లలో బీఆర్ఎస్ 45.6 శాతంతో, పరిగిలో కాంగ్రెస్ 58 శాతంతో, వికారాబాద్ లో కాంగ్రెస్ 57.9 శాతంతో, తాండూరులో బీఆర్ఎస్ 43.8 శాతం ఓట్లు సాధిస్తుందని స్పష్టం చేసింది.
ఉమ్మడి వరంగల్…
ఇక ఉమ్మడి వరంగల్ విషయానికి వస్తే నర్సంపేట, పరకాల, వరంగల్ పశ్చిమ, వర్దన్నపేటల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ 46 శాతంతో గెలుస్తుందని సీ ఓటర్ ఒపీనియన్ పోల్ సర్వే తెలిపింది. కానీ వరంగల్ తూర్పులో మాత్రం కాంగ్రెస్ 54.7 శాతం ఓట్లతో గెలుస్తుందని వెల్లడించింది. బీజీపీ మాత్రం ఎక్కడా పోటీ కూడా ఇవ్వలేదని ఒపీనియన్ పోల్ లో స్పష్టం అవుతోంది. ఉమ్మడి వరంగల్ లో జనగామలో 46.8 శాతం, డోర్నకల్ 57, మహబూబాబాద్ (ఎస్టీ) 53.8 శాతం ఓట్లతో బీఆర్ఎస్… స్టేషన్ ఘన్ పుర్ (ఎస్సీ) 46.4, పాలకుర్తి 49.5 శాతం ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తుందని ఈ సర్వే అంచనా వేసింది.
ఉమ్మడి మహబూబ్ నగర్…
ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మూడు చోట్ల కాంగ్రెస్ గెలిస్తే రెండు చోట్ల మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుందని ఒపీనియన్ పోల్ తెలిపింది. కొడంగల్, నారాయణపేట, జడ్చర్లలో కాంగ్రెస్ 45 శాతం కన్నా ఎక్కువ ఓట్లతో గెలుపొందుతుందని వెల్లడించింది. ఇక మహబూబ్ నగర్, దేవరకద్ర నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేసింది. ఇక్కడ అధికార పార్టీ 43 శాతం నుంచి 47 శాతం వరకూ ఓట్లతో గెలుపొందే అవకాశం ఉంది. మక్తల్ లో 38.6, వనపర్తిలో 51.8, గద్వాల్ 44.6 , నాగర్ కర్నూల్ లో 53.1, అచ్చంపేట 45.2, షాద్ నగర్ 46 శాతాలతో బీఆర్ఎస్, ఆలంపూర్ లో 47.9, కల్వకుర్తి 38.4, కొల్లాపూర్ 45.38 శాతంతో కాంగ్రెస్ గెలుస్తుందని సీ-ఓటర్ సర్వే చెబుతోంది.
ఉమ్మడి ఖమ్మం…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగే టఫ్ ఫైట్ లో కాంగ్రెస్ పై చేయి సాధిస్తుందని ఒపీనియన్ పోల్ లెక్కలు చెబుతున్నాయి. సీ ఓటర్ ఒపీనియన్ పోల్ సర్వేలో మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలు ఉంటే అందులో కాంగ్రెస్ 7 బీఆర్ఎస్ 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుందని చెబుతోంది. బీజేపీకి అసలు ఎక్కడా ఛాన్స్ లేదనే తెలుస్తోంది. అయితే అక్కడ చాలా చోట్ల జనసేన పోటీ చేస్తోందని. ..సీ ఓటర్ ఒపీయన్ పోల్ ఆ పార్టీని పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. వైరా, కొత్తగూడెం, పినపాక, ఇల్లందు, ఖమ్మం, ఆశ్వారావు పేట, భద్రాచలంలో కాంగ్రెస్…పాలేరు, మధిర, సత్తుపల్లిల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని ఈ ఒపీనియన్ పోల్ లెక్కలు చెబుతున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్…
ఉమ్మడి నిజామాబాద్ లో బీఆర్ఎస్ దే హవా కనిపిస్తోంది. ఆర్మూర్ 48.1 శాతంతో, బాన్సువాడ 48.3, జుక్కల్ 38.3, బోధన్38.1 శాతంతో ఆ పార్టీ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. ఎల్లారెడ్డి లో మాత్రం కాంగ్రెస్ 40.2 శాతం ఓట్లతో గెలుస్తుందని ఒపీనియన్ పోల్ తెలిపింది. కామారెడ్డి 44.43, నిజామాబాద్ 49.1, నిజామాబాద్ రూరల్ 39.87, బాల్కొండ 44.3 శాతం ఓట్లతో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది.
ఉమ్మడి నల్గొండలో హస్తం హవా:
కాంగ్రెస్ అగ్రనేతలు బరిలో ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందని సీ-ఓటర్ ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. అక్కడ మూడు స్థానాలు మినహాయించి.. మిగతా అన్నింటిలోనూ కాంగ్రెస్సే విజయం సాధిస్తుందని సీ-ఓటర్ ఒపీనియన్ పోల్ లెక్కలు చెబుతున్నాయి. ఉమ్మడి నల్గొండలో జిల్లాలోని మునుగోడులో 39.9, భువనగిరిలో 45.7 , మిర్యాల గూడ 44.5 శాతం ఓట్లతో బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. సూర్యాపేటలో 47.4 శాతం, నల్గొండలో 59.9, నకిరేకల్ (ఎస్సీ)లో 59.8 , తుంగతుర్తి 60.9, ఆలేరు 51.3 , దేవరకొండ 54.9, నాగార్జునసాగర్ 51.7, హుజూర్ నగర్ 59, కోదాడ 59.3 శాతం ఓట్లతో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని ఈ ఒపినీయన్ పోల్ చెబుతోంది.
ఉమ్మడి ఆదిలాబాద్…
ఉమ్మడి అదిలాబాద్ లో మొత్తం పది సీట్లు ఉండగా.. ఇందులో బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ (51.5) , బోథ్(36.2), సిర్పూర్(43.9), ఆసిఫాబాద్ (44.8) సీట్లలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీ చెన్నూరులో 48.45 , బెల్లంపల్లి 48.2, మంచిర్యాలలో 53 , ఖానాపూర్ 48.5 శాతం ఓట్లతో గెలుపొందుతుందని ఈ ఒపీనియన్ పోల్ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబద్ జిల్లాలోని నిర్మల్ లో 40.7 శాతం ఓట్లతో, ముధోల్ లో 38.2 శాతం ఓట్లతో బీజేపీ గెలుపొందుతుందని ఈ ఒపీనయన్ పోల్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
https://www.youtube.com/watch?v=qin2mM5mVAc