ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు రెండు జిల్లాల్లో 24 శాతం ఓటింగ్ నమోదయింది. అయితే అక్కడక్కడా అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. భద్రాద్రి కొత్తగౌడెం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఆపీసర్ గుండెపోటుతో అక్కడే మరణించారు. అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ శ్రీకృష్ణ ఎన్నికల విధులు నిర్వహిస్తూ పోలింగ్ బూత్ లోనే కుప్పకూలిపోయారు. అశ్వారావుపేట – నెహ్రూనగర్ పోలింగ్ బూత్ -165 లో ఈ ఘటన జరిగింది. శ్రీకృష్ణను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. గుండెపోటు కారణంగా శ్రీకృష్ణ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భద్రాధ్రికొత్తగూడెం జిల్లా పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అధికారిగా శ్రీకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు. పోలింగ్ వేల విధినిర్వహణ సమయంలో ఆయన మృతిచెందడంతో ఆయన సహచరులు విషాదంలో మునిగిపోయారు.
మరోవైపు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఓటేయడానికి వచ్చిన ఓ వృద్ధ మహిళ చనిపోయారు. క్యూలైన్లో నిల్చున్న పాలూరి పెంటమ్మ ఉన్నట్టుండి పడిపోయారు. పోలింగ్ బూత్ వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లనే ఆమె మృతి చెందిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ముసలామె గుండెపోటు కారణంగానే మరణించిందని వైద్యులు చెబుతున్నారు. పెంటమ్మ వయసు 55 సంవత్సరాలు ఉండొచ్చని తెలుస్తోంది
Elderly woman, Paluri Pentamma (55), dies while waiting in queue to vote at Thangudubilli in #Nellimarla Constituency. Allegations arise of inadequate arrangements for #voters, sparking anger among voters towards district administration#ElectionsWithTNIE@NewIndianXpress pic.twitter.com/puUhEnrMLa
— TNIE Andhra Pradesh (@xpressandhra) May 13, 2024