Samantha Ruth Prabhu : టాలీవుడ్(Tollywood) స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఇండస్ట్రీలో ఆమెకు ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. సోషల్ మీడియా(Social Media) లో లేటెస్ట్ పిక్స్ షేర్ చూస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటారు. ఇటీవల పాడ్ కాస్ట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. జనాలలో హెల్త్ అవేర్ నెస్ పెంచేందుకు ఇటీవల ఓ వెల్ నెస్ కోచ్ తో పలు సూచనలు చెప్పించింది. అయితే, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వైరలవుతున్న ప్రోమో
ఈ పాడ్ కాస్ట్ లో కాలేయ ఆరోగ్యానికి డాండెలిన్ చాలా బాగా ఉపకరిస్తుందని సదరు వెల్ నెస్ కోచ్ చెప్పుకొచ్చారు. తాజాగా, ఈ పాడ్ కాస్ట్ పై కాలేయ వ్యాధి నిపుణుడు ఒకరు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. మెడిసిన్ చదివి, కాలేయవ్యాధి వైద్యుడిగా పదేళ్లుగా రోగులకు సేవ చేస్తున్నానని తన గురించి వివరించారు.
సమంత పాడ్ కాస్ట్(Podcast) జనాలను తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొన్నారు. డాండెలిన్ తో కాలేయానికి మేలు కలుగుతుందనేందుకు ఎలాంటి ఆధారం లేదన్నారు. ఈ పాడ్ కాస్ట్ మొత్తం అసంబద్ధంగా, వారి అవగాహనా రాహిత్యం వెల్లడించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శరీరం పనితీరు గురించి కనీస అవగాహన లేకుండా నోటికొచ్చింది చెప్పారంటూ సదరు వెల్ నెస్ కోచ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
This is Samantha Ruth Prabhu, a film star, misleading and misinforming over 33 million followers on “detoxing the liver.”
The podcast feature some random health illiterate “Wellness Coach & Performance Nutritionist” who has absolutely no clue how the human body works and has the… pic.twitter.com/oChSDhIbu2
— TheLiverDoc (@theliverdr) March 10, 2024
Also Read : అశ్లీల కంటెంట్ ఉన్న 18 OTT ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం కొరడా.. ఏకంగా బ్యాన్!
ఎలుకలపై జరిపిన ప్రయోగాత్మక పరిశోధనలో డాండెలిన్ వల్ల పలు ప్రయోజనాలు ఉన్నట్లు తేలిందని కాలేయ వ్యాధి వైద్యుడు తన పోస్టులో చెప్పుకొచ్చారు. డాండెలిన్ ఒక రకమైన కూరగాయ లాంటిదని.. దీనిని సలాడ్ లో ఉపయోగిస్తారని వివరించారు. సుమారు 100 గ్రాముల డాండెలిన్ తీసుకుంటే శరీరానికి రోజువారీ అవసరమయ్యే పొటాషియంను 10 నుంచి 15 శాతం తీరుస్తుందని అన్నారు.
మూత్రం ఎక్కువగా వచ్చేందుకు తోడ్పడుతుందని వెల్లడించారు. జీర్ణక్రియను మెరుగు పరుస్తుందని మరికొంతమంది చెబుతున్నారన్నారు. అయితే, ఇవేవీ శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు. డాండెలిన్ ప్రయోజనాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని డాక్టర్ పేర్కొన్నారు. మనుషులపై పూర్తిస్థాయిలో పరిశోధనలు జరగలేదని వెల్లడించారు.
ఇవేవీ తెలియకుండా, తెలుసుకోకుండా స్టార్ హీరోయిన్ సమంత తన ఫాలోవర్లను తప్పుదోవ పట్టించేలా పాడ్ కాస్ట్ చేసిందని ఆరోపించారు. సమంత పాడ్ కాస్ట్ విన్న జనం ఆరోగ్యం కోసమంటూ డాండెలిన్ ను తీసుకుంటే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా డాండెలిన్ సప్లిమెంట్లు తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదని సూచించారు.