Asia Cup 2023 India vs Sri Lanka: పాక్ ను చిత్తుచిత్తుగా ఓడించి మంచి ఉత్సాహంగా ఉన్న టీమ్ ఇండియా మరో కీలక మ్యాచ్ కు సిద్ధమవుతోంది. సూపర్ -4 లో శ్రీలంకతో భారత్ ఈరోజు తలపడుతోంది. రెండు జట్లకు ఇది కీలకమైనది కావున పటిష్టమైన టీమ్ తో దిగుతున్నాయి. ఈరోజు మ్యాచ్ కూడా శ్రీలంకలోని కొలంబో స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 3గంటలకు ఆట ఆరంభం అవుతుంది.
భారత్-శ్రీలంక మ్యాచ్ కు కూడా వర్షం అడ్డుపడొచ్చని చెబుతోంది కొలొంబో వాతావరణశాఖ. ఆకాశం 89శాతం మేఘావృతం అయి ఉంటుందని, 60 శాతం వర్షం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే కనుక జరిగితే మ్యాచ్ కు అంతరాయం కలగడం కానీ, ఆగిపోవడం కానీ జరగవచ్చును. ఒకవేళ మ్యాచ్ కనుక సవ్యంగా జరిగితే భారీ స్కోర్లు నమోదవుతాయి. ప్రేమదాస స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. అందుకే నిన్నటి మ్యాచ్ లో భారత్ 350 పరుగుల స్కోర్ చేయగలిగింది.
మ్యాచ్ రద్దయితే…
వర్షం బాగా పడి అస్సలు ఆట ఆడడానికే అవకాశం లేకపోతే భారత్-శ్రీలంక మ్యాచ్ ను రద్దు చేస్తారు. అదే కనుక జరిగితే ఙరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. దీంతో భారత్, శ్రీలంక కు చెరో మూడు పాయింట్లు ఉంటాయి. దీంతో ఈ రెండు జట్లతో పాటూ పాకిస్తాన్ కూడా ఫైనల్ లో ఉంటాయి. ఒకవేళ మ్యాచ్ జరిగి భారత్ గెలిస్తే కనుక డైరెక్ట్ గా ఫైనల్ కు వెళ్ళిపోతుంది. అప్పుడు రెండో టీమ్ కోసం శ్రీలంక, పాకిస్తాన్ లు పోటీ పడతాయి. కాబట్టి మ్యాచ్ జరిగకపోయినా టీమ్ ఇండియా పెద్దగా నష్టపోయింది ఏమీ ఉండదు.
Also Read: కోహ్లీని కొట్టేవాడే లేడు…మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రికార్డ్ బద్దలు